బాలీవుడ్ లవర్ కార్తీక్ ఆర్యన్ సీక్వెల్ స్టార్ గా మారుతున్నాడు. స్టార్ రేసులో సాలిడ్ ప్లేస్ దక్కించుకునేందుకు వరుసగా సీక్వెల్ సినిమాల్లో నటిస్తున్నాడు కర్తీక్. ఇప్పటికే రెండు సీక్వెల్స్ కు సైన్ చేసిన కార్తీక్, ఇప్పుడు మరో సీక్వెల్ కు కమిట్ అయ్యాడు. కెరీర్ కు బిగ్ బ్రేక్ ఇచ్చి కామెడీ ఎంటర్ టైనర్ కు సీక్వెల్ చేయబోతున్నాడు కార్తీక్ ఆర్యన్.
కార్తిక్ ఆర్యన్ బాలీవుడ్ లో సాలిడ్ ఇమేజ్ సంపాదించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. బీటౌన్ లో స్టార్ హీరోగా ఎదగాలని, నంబర్ గేమ్ లో తనకూ చోటుండాలని కలలు కంటున్నాడు. అయితే ఈ డ్రీమ్ ను ఫుల్ ఫిల్ చేసుకోవడానికి హిట్ సినిమాల వెంట పడుతున్నాడు కార్తీక్ ఆర్యన్. సక్సెస్ స్టోరీస్ కు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు.
కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం రెండు సీక్వెల్స్ కు సైన్ చేశాడు. దోస్తానా 2, బూల్ బులాయా 2 సినిమాకు కాల్షీట్స్ ఇచ్చాడు. జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్, ప్రియాంకా చోప్రా లీడ్ రోల్స్ లో వచ్చిన దోస్తానా బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేసింది. ఈ సక్సెస్ ను కంటిన్యూ చేయడానికి దోస్తానా 2లోకి దిగాడు కార్తీక్. అలాగే అక్షయ్ కుమార్ సూపర్ హిట్ బూల్ బులాయా సీక్వెల్ లోనూ నటిస్తున్నాడు.
కార్తీక్ ఆర్యన్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన సినిమా సోనూ కే టిటు కీ స్వీటీ. సన్నీ సింగ్, కార్తీక్ ఆర్యన్, నుప్రత్ లీడ్ రోల్స్ ప్లే చేసిన ఈ మూవీతోనే కార్తీక్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ హిట్ తోనే బాలీవుడ్ లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడీ మూవీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. లాక్ డౌన్ కంప్లీట్ అవ్వగానే ఈ సీక్వెల్ ను స్టార్ట్ చేస్తాడని టాక్ వస్తోంది.
కార్తీక్ ఆర్యన్ సూపర్ హిట్ కోసం సీక్వెల్స్ మాత్రమే కాదు క్లాసిక్ హిట్స్ ను రీమేక్ చేశాడు. సైఫ్ అలీ ఖాన్ లవ్ ఆజ్ కల్ సినిమాను, సంజీవ్ కుమమార్ పతి పత్నీ ఔర్ ఓ సినిమాలను రీమేక్ చేశాడు. కానీ ఈ రీమేక్స్ కార్తీక్ కు సరైన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. మరి ఇప్పుడీ సీక్వెల్స్ ఎలాంటి ఫలితాలు ఇస్తాడో చూడాలి.