ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అవుతుందో లేదో తెలియకపోతే ఆ ఫీలింగ్ ఒకలా ఉంటుంది. అంతేగానీ సినిమా ఓకే అయ్యి, ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియకపోతేనే డైరెక్టర్ కు చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పెండింగ్ ప్రాజెక్ట్ ను క్లియర్ చేయలేక సతమతమవుతున్నారు. 

 

బంగార్రాజును పట్టాలెక్కించేందుకు నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడు కళ్యాణ్ కృష్ణ. సోగ్గాడే చిన్నినాయనా టైమ్ లోనే బంగార్రాజుని ఎనౌన్స్ చేసిన కళ్యాణ్ కృష్ణ ఇప్పటికీ ఈ సిినిమాను సెట్స్ కి తీసుకెళ్లలేకపోతున్నాడు. ఒకసారి స్టోరీ సెట్ కాలేదని మరోసారి మరో కారణంతో వాయిదా పడుతోన్న ఈ ప్రాజెక్ట్ ను లాక్ డౌన్ మరింత వెనక్కి నెట్టేసింది. 

 

నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే బంగార్రాజుని స్టార్ట్ చేయాలనుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. అయితే లాక్ డౌన్ తో వైల్డ్ డాగ్ షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. సో లాక్ డౌన్ ముగిసిన తర్వాత నాగ్ మళ్లీ వైల్డ్ డాగ్ సెట్స్ లోనే అడుగుపెడతాడు. దీంతో బంగార్రాజు మరికొన్నాళ్లపాటు వెనక్కి వెళ్లే అవకాశముంది. 

 

కళ్యాణ్ కృష్ణ బంగార్రాజుపైనే చాలా ఆశలు పెట్టుకున్నాడు. రవితేజతో తీసిన నేలటిక్కెట్టు డిజాస్టర్ కావడంతో ఈ దర్శకుడి ఇమేజ్ డ్యామేజ్ అయింది. దీంతో బంగార్రాజుతో హిట్ కొట్టి మళ్లీ ట్రాక్ ఎక్కాలనుకున్నాడు. మరో ప్రాజెక్ట్ వైపు వెల్లకుండా ఈ సినిమాకే ఫిక్స్ అయ్యాడు. కానీ లాక్ డౌన్ తో కళ్యాణ కృష్ణ ఆశలు కూడా వాయిదా పడుతున్నాయి. మరి నాలుగేళ్లుగా సాగుతున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి. మొత్తానికి కళ్యాణ్ కృష్ణ బంగార్రాజుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటే కరోనా మాత్రం ఆయన ఆశలపై నీళ్లు చల్లేసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నాగార్జున మాత్రం  త్వరలో వైల్డ్ డాగ్ తో బిజీ అయిపోనున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: