టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్, అతి త్వరలో ప్రారంభం కానున్న తన తదుపరి సినిమా సర్కారు వారి పాట కోసం కొద్దిరోజులుగా డిఫరెంట్ మేకోవర్ స్టైల్ తో సిద్ధమవుతున్నారు. బ్యాంకు మోసాల నేపథ్యంలో ఎంతో భారీ లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమాకు గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, మహేష్ సరసన తొలిసారిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, తొలి సినిమా రాజకుమారుడు సూపర్ హిట్ తోనే సూపర్ క్రేజ్ దక్కించుకున్న మహేష్ బాబు పై బాలీవుడ్ దర్శక, నిర్మాతల చూపు పడిందని, అలానే అప్పట్లో రెండు బాలీవుడ్ మూవీ అఫర్స్ కూడా వచ్చినప్పటికీ అటు వైపు వెళ్ళడానికి మహేష్ మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదని వార్తలు రావడం జరిగింది. 

IHG

ఇక ఆ తరువాత టాలీవుడ్ లో వరుసగా అవకాశాలతో దూసుకెళ్ళిన సూపర్ స్టార్, అనంతరం ఎన్నో పెద్ద సక్సెస్ లు అందుకుని సూపర్ స్టార్ గా గొప్ప ప్రేఖ్యాతలు గడించారు. ఇక మహేష్ బాబు అందం, చరిష్మా, క్రేజ్, టాలెంట్ ఇక్కడే పరిమితం కాకూడదని, అందుకే ఆయన మా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలని అప్పటి బడా నిర్మాత ఒకరు ఆయనను గట్టిగ కోరినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అయినప్పటికీ కూడా మహేష్ మాత్రం బాలీవుడ్ పై ఆసక్తి చూపలేదు. ఇక కొన్నేళ్ల క్రితం నమ్రతతో వివాహం తరువాత మహేష్ కు బాలీవుడ్ లో పరిచయాలు విపరీతంగా పెరగడం, అలానే ఆయన క్రేజ్ కూడా అమాంతం పెరగడం, ముఖ్యంగా బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లోని చాలామంది హీరోయిన్స్, అలానే సినీ ప్రముఖులు సైతం మహేష్ కు ఫ్యాన్స్ గా మారడం జరిగింది. అయినప్పటికీ, ఆయన బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎవరు, ఎప్పుడు మాట్లాడినా, మహేష్ నుండి మాత్రం ఉండదు అనే సమాధానం రాసాగింది. ఇక ఇటీవల సరిలేరు నీకెవ్వరు మూవీ సక్సెస్ సందర్భంగా సోల్జర్స్ తో జరిగిన మీట్ లో భాగంగా మహేష్ బాబు మాట్లాడుతూ, తాను ఇప్పుడే కాదు, ఎప్పటికీ కూడా బాలీవుడ్ కి వెళ్లే ప్రసక్తి లేదని ఖరాఖండీగా తేల్చి చెప్పారు. 

 

అయితే మరోవైపు ఆయన ఫ్యాన్స్ మాత్రం, మా సూపర్ స్టార్ ని బాలీవుడ్ తెరపై చూడాలని ఎన్నేళ్ళనుండో ఆశపడుతున్నారు. ఈ విషయమై కొన్నాళ్ల క్రితం, కొందరు అభిమానులు సైతం ప్రత్యేకంగా మహేష్ సతీమణి నమ్రతను కలిసి, మహేష్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ప్రస్తావించడం జరిగిందని సమాచారం. అయితే ఈ విషయమై మాత్రం మహేష్ బాబు మాటతప్పరని ఆయన సన్నిహిత వర్గాలు కూడా చెప్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విధంగా బాలీవుడ్ విషయమై సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారో లేదో తెలియాలి అంటే మాత్రం దానికి కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: