మళయాళ సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం కొరటాల శివ డైరక్షన్ లో చేస్తున్న ఆచార్య సినిమా పూర్తి కాగానే ఈ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. లూసిఫర్ రీమేక్ డైరెక్ట్ చేసే బాధ్యతను సాహో ఫేమ్ సుజిత్ మీద పెట్టారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా ఈమధ్య సుజిత్ స్క్రిప్ట్ ఫైనల్ వర్షన్ చిరుకి వినిపించగా అది చిరుకి నచ్చలేదని తెలుస్తుంది. అందుకే ఈ రీమేక్ నుండి సుజిత్ ను తప్పించి అతని ప్లేస్ లో వి.వి.వినాయక్ ను తీసుకోవాలని అనుకుంటున్నారట.
రీమేక్ స్పెషలిస్ట్ గా v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ కు మంచి పేరుంది. అంతేకాదు ఆయన డైరక్షన్ లో చిరు సినిమాకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఠాగూర్, ఖైది నంబర్ 150 సినిమాలు v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ డైరక్షన్ లో వచ్చిన సినిమాలే. అందుకే ఇప్పుడు ఈ రీమేక్ ను కూడా v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ చేతుల్లో పెట్టాలని చూస్తున్నాడట చిరంజీవి. అయితే సుజిత్ ను పూర్తిగా తప్పించకపోవచ్చని.. సినిమాకు v VINAYAK' target='_blank' title='వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వినాయక్ హెల్ప్ తీసుకునే ఛాన్స్ ఉందని మరో టాక్ వస్తుంది.
రన్ రాజా రన్ తో డైరక్టర్ గా మెప్పించిన సుజిత్ బాహుబలి తర్వాత ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు. ఆ సినిమా టేకింగ్ విషయంలో సుజిత్ కు మంచి మార్కులు పడ్డాయి. అయితే సాహో కమర్షియల్ గా సక్సెస్ అయ్యుంటే పరిస్థితి వేరేలా ఉండేది. సాహో తర్వాత చిరు మూవీ ఛాన్స్ అందుకోవడం విశేషమే అయినా ప్రస్తుతం ఆ సినిమా సుజిత్ చేతుల్లో ఉంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. లూసిఫర్ రీమేక్ ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తేనే గాని తెలుస్తుంది.