బిచ్చగాడు సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఆ సినిమా తమిళంలో కన్నా తెలుగులో ఘన విజయాన్ని అందుకుంది. కోటి రూపాయలతో డబ్బింగ్ రైట్స్ తీసుకుని రిలీజ్ చేసిన ఆ సినిమా 50 కోట్లను వసూళు చేసింది అంటే ఆ సినిమా స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. బిచ్చగాడు సినిమా తర్వాత యూట్యూబ్ లోనూ విజయ్ ఆంటోని ఇదివరకు సినిమాలకు డిమాండ్ పెరిగింది. ఇక ఆ తర్వాత తను చేసే ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వచ్చాడు విజయ్ ఆంటోని. తను తీసే ప్రతి సినిమా ప్రయోగాత్మకమే అందుకే తెలుగులో ఆయన ప్రతి సినిమాకు ఆదరణ దక్కింది.
బిచ్చగాడు తర్వాత బేతాళుడు, యముడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్ సినిమాలు చేశాడు విజయ్ ఆంటోని అయితే సినిమాలైతే వస్తున్నాయి కాని బిచ్చగాడి రేంజ్ లో ఏది ఆడలేదు. లేటెస్ట్ గా బిచ్చగాడు సినిమాకు సీక్వల్ గా బిచ్చగాడు 2 తెరకెక్కిస్తున్నారట విజయ్ ఆంటోని. ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిందట. ఈ నెల 24న విజయ్ ఆంటోని బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ప్రకటన ఉంటుందని తెలుస్తుంది.
బిచ్చగాడు సినిమాతో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మళ్ళీ ఆ సినిమా సీక్వల్ తోనే హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు విజయ్ ఆంటోని. ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది.. బిచ్చగాడి రేంజ్ లో సినిమా ఉంటుందా లేదా అని తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.బిచ్చగాడు సినిమా మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కించారు. ఈసారి ఎలాంటి కథతో వస్తున్నారో చూడాలి. బిచ్చగాడు 2 ఎనౌన్స్ మెంట్ రాగానే తెలుగు రిలీజ్ కోసం భారీ బిజినెస్ జరిగే అవకాశం ఉంది.