టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ స్టార్ కమెడియన్లలో ఆలీ ఒకరు. మొదట సినిమాల్లో బాల నటుడిగా ప్రవేశం చేసారు. ఆ తర్వాత స్టార్ కమెడియన్ గా ఎదిగిపోయారు. ఇండస్ట్రీలో హీరోగా, హాస్యనటుడుగా, యాంకర్ గా తనదైన ముద్ర వేసాడు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన అతి కొద్ది నటుల్లో ఆలీ ఒకరు. మొదట ఆలీ మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత ఏడాది కాలంలోనే బాలనటుడిగా మారాడు. ఆపై ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు.కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు.
ఆ తర్వాత నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఒక అర్ధం లేని భాషతో ప్రేక్షకులను నవ్వుల లోకంలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ సినిమాలోని "ఎంద చాట "అంటూ ఆలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది.ఇప్పటికి ఆలీ చెప్పే ఎంద చాట అనే డైలాగ్ వింటే చాలు నవ్వు ఆపుకోలేరు. ఎంద చాట అనే ఒక్క డైలాగ్ మాత్రమే కాదు "కాట్రవల్లీ"... "బాగున్నారా బాగున్నారా"... "లచ్చిమీ థాయ్ మసాజ్".. అంటూ సినిమాల్లోని డైలాగ్స్ తో అందరిని కడుపుబ్బా నవ్వించారు..ఆలీ అంటే చాలు వెంటనే ఈ డైలాగ్స్ గుర్తు వస్తాయి.
కమెడియన్ తర్వాత యమలీల చిత్రంద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు. అడపా దడపా కథానాయక పాత్రలను పోషిస్తున్నా మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇచ్చాడు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి ఉత్తమ హాస్య నటుడి గా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు.ఆ తర్వాత వచ్చిన సూపర్ (2005) సినిమాకి గాను ఉత్తమ హాస్య నటుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం.సూపర్ సినిమాలో డ్రాయింగ్ వేసే మాస్టర్ గా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేశారు.ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో పాత్రలో ప్రేక్షకులను అలరించాడు ఆలీ.డైలాగ్ చెప్పడంలో కానీ ముఖంలో హాస్యాన్ని చూపించడంలో గాని ఆలీకి సాటిరారు ఎవ్వరు.. !!