
నవ్వడం ఒక భోగం ... నవ్వించడం ఒక యోగం... నవ్వకపోవడం ఒక రోగం.. అన్నారు మన జంధ్యాల గారు. అలాంటి నవ్వు మనం నవ్వాలన్న,మనల్ని నవ్వించాలన్న గాని అది ఒక్క బ్రహ్మంనందంకు మాత్రమే సాటి.మామూలుగా మనం ఓ నలుగురిని నవ్వించడానికి నానా తంటాలు పడతాం. అయితే బ్రహ్మానందం మాత్రం తన నటనతో కొన్ని కోట్ల మందిని నవ్విస్తున్నారు. అయన పేరులోనే ఉంది ఆనందం. ఆయన్ని తలచుకుంటే చాలు అందరికి బ్రహ్మ.... ఆనందం.. !! తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యక ఇమేజ్ సంపాదించుకున్నారు బ్రహ్మానంధం. దాదాపు వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన అరుదైన నటుడు బ్రహ్మానందం .
బ్రహ్మనందం ఒక ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు.అయన నటనకు మెచ్చి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నాడు..బ్రహ్మానందం కి బాగా పేరు తెచ్చిన సినిమా అహ..!నా పెళ్ళంటా..!ఈ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్ గాని, ముఖ కదలికలు గాని ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. "పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని కక్కలేక తనలోనే దిగమింగుకునే పాత్రలో భలే నవ్వుల్నీ పండించారు.
నటుడిగా గుర్తింపు నిచ్చిన అహ నా పెళ్లంట చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది.తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం.ప్రతిష్ఠాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యధిక సినిమాలు నటించి అందులో చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు మన బ్రహ్మానందం.బ్రహ్మానందం ఏది చేసిన గాని కామెడీయే.దాదాపు మన తెలుగు సినిమాలోని అందరి హీరోలతో నటించిన ఘనత మన బ్రహ్మానందం గారి సొంతం.. అలాగే కొన్ని కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం చేసిన పాత్రలు చాలా ఫేమస్ అయ్యాయి. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, డీ లో రావు గారు, విక్రమార్కుడు, రేసుగుర్రం, కృష్ణ ఇలా చెప్పుకోదగ్గ సినిమాలు చాలానే ఉన్నాయి. అలాగే కిల్ బిల్ పాండేగా.. కత్తి రాందాసుగా.. అరగుండుగా.. ఖాన్ దాదాగా, శంకర్ దాదా ఆర్ ఎంపి ఇలా వైవిధ్యభరితమైన పాత్రల పేర్లతో సినిమాలో హాస్యాన్ని పండించాడు. కామెడీ విషయంలో బ్రహ్మానందం గురించి ఎంత చెప్పుకున్నా ఎంతో కొంత మిగిలే ఉంటుంది.