అల వైకుంఠపురములో సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ లో తన నెక్స్ట్ సినిమా పుష్పని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప సినిమాను తెలుగుతో పాటుగా తమిళ, హింది, మళయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ సినిమా లైన్ లో ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా బన్నీ వస్తే షూటింగ్ మొదలుపెట్టడమే అంటున్నారు.      

 

ఇదిలాఉంటే అల్లు అర్జున్ తో యాత్రం ఫేమ్ మహి వి రాఘవ ఓ సినిమా చేస్తాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కళాశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాత్ర బన్నీతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ను సిఎంగా చూపిస్తాడని తెలుస్తుంది. ఈమధ్యనే డైరక్టర్ మహి అల్లు అర్జున్ ను కలవడం.. స్టోరీ ఓకే చేయడం జరిగిందట. లైన్ ఓకే అని చెప్పగా బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే ఆలోచిద్దామని అన్నాడట బన్నీ. 

 

నా పేరు సూర్య తర్వాత కథల విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అల వైకుంఠపురములో సినిమా త్రివిక్రం మీద నమ్మకంతో చేశాడు. రాబోయే పుష్ప కూడా సుకుమార్ కథ చెప్పినట్టుగా తీయగలడనే నమ్మకంతో పాన్ ఇండియాగా ఈ సినిమా ప్లాన్ చేశాడు. వేణు శ్రీరాం ఐకాన్, మహి వి రాఘవ సినిమాలు కూడా బన్నీ లైన్ లో పెట్టాడని తెలుస్తుంది. మరి కెరియర్ లో ఫస్ట్ టైం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్న బన్నీ ఈ సినిమాతో ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: