కరోనా కారణంగా సినీరంగం అంతటా స్తబ్దుగా ఉంటే.. ఈ కాలంలోనూ బిజీగా ఉన్న ఏకైక వ్యక్తిగా రామ్ గోపాల్ వర్మను చెప్పుకోవచ్చు.. ప్రస్తుతం ఆయన ఒక్కరే సినీరంగంలో ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా జోరు చూపుతున్నారు. వరుసగా సినిమాలు తీస్తూ.. వాటిని తనదైన పద్దతిలో విడుదల చేస్తూ డబ్బు పోగేసుకుంటున్నాడు. 

 

ఓవైపు కరోనా విజృంభిస్తున్న సమయంలోనే ఆయన  ‘క్లైమాక్స్‌’, ‘నేక్డ్’, ‘కరోనా వైరస్‌’ వంటి చిత్రాలను రూపొందించేశారు. అంతే కాదు.. వాటిని ఆన్ లైన్ లోనే విడుదల చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన  పవర్ స్టార్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏకంగా ఈ సినిమా ట్రైలర్ కు కూడా 25 రూపాయల ఫీజు పెట్టేశారు రామ్ గోపాల్ వర్మ. 

 

ఇలా సినిమా ట్రైలర్ కు టికెట్ పెట్టిన దర్శకుడు బహుశా ప్రపంచంలోనే వర్మ ఒక్కడేనేమో.. 
ఈ కరోనా టైమ్ లో రాజమౌళి వంటి భారీ చిత్రాల దర్శకుల సినిమాలు కూడా షూటింగ్ ఆగిపోయాయి. ఈ సమయంలో ఆర్జీవీ రాజమౌళికి  కరోనా పాఠాలు బోధిస్తున్నారు. కరోనా కాలంలో  ప్రపంచమంతా ఆన్‌లైన్‌కు మారుతోందంటున్న వర్మ.. రాజమౌళిని కూడా ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. 

 

ప్రస్తుతం ఇదే సరికొత్త మార్కెట్ అంటున్న వర్మ.. ఇప్పుడంతా సరి కొత్తగా ఆలోచించడం కావాలంటున్నారు.  మేమంతా rrr ట్రైలర్ కు డబ్బులు చెల్లించి చూసే సమయం కోసం వేచి చూస్తున్నాం  అంటూ ఓ ట్వీట్ పెట్టారు. మరి ఇంకా దీనిపై రాజమౌళి మాత్రం ఇంకా స్పందించలేదు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: