ఒక దర్శకుడుకి బొమ్మలు గీయడం కవితలు వ్రాయడం లాంటి భావయుక్తమైన అలవాట్లు చాల తక్కువమందిలో కనిపిస్తాయి. గతంలో ప్రఖ్యాత దర్శకుడు బాపు కి ఇలాంటి అలవాట్లు ఉండేవి. ‘నీది నాది ఒకే కథ’ లాంటి వెరైటీ సినిమాను తీసిన ఈ విలక్షణ దర్శకుడు ప్రస్తుతం రానా తో ‘విరాటపర్వం’ సినిమాతో బిజీగా ఉన్నాడు.


1990 ప్రాంతంలో జరిగిన ఒక రాజకీయ సంఘటనకు తన వ్యక్తిగతమైన కాల్పనిక దృష్టితో ఈ మూవీ కథను వేణు క్రియేట్ చేసాడు. ఈ మూవీ పై మంచి అంచనాలు కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు వేణు కు ఈమధ్య తరుచూ అర్థరాత్రి కలలు వస్తున్నాయట. తాను ఫ్లాప్ సినిమాను తీస్తున్నానా అన్న భయంతో ఒకేసారి ఉలిక్కిపడి నిద్రలేవడమే కాకుండా తాను అప్పటి వరకు వ్రాసిన ఆ కథను ఆ అర్థరాత్రి సమయంలో లేచి చదువుకుంటున్నాడట.


ఆ సమయంలో తాను తన కథను బాగా వ్రాసాను అన్న నమ్మకం కల్గిన తరువాత మళ్ళీ పడుకునే అలవాటు చేసుకున్నాడట. ప్రస్తుతం అల్లు అరవింద్ ప్రోత్సాహంతో చలం ‘మైదానం’ నవలను వెబ్ సిరీస్ గా మార్చే ప్రయత్నాలలో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చాక సినిమా కథ చెప్పే విధానంలో చాల మార్పులు వచ్చాయని గతంలో లా రొటీన్ పద్ధతిలో కథను తీస్తే జనం సినిమాలను చూసే పరిస్థితి లేదు అంటూ అభిప్రాయపడుతున్నాడు.


ఇదే సందర్భంలో ఇండస్ట్రీలో కొనసాగుతున్న బంధు ప్రీతీ గురించి మాట్లాడుతూ మొదట్లో ఒక వ్యక్తికి చాల సులువుగా అవకాశం రావడానికి బంధు ప్రీతీ ఉపయోగపడుతుంది కాని ఆ వ్యక్తి ఇండస్ట్రీలో నిలబడటానికి ఈ బంధు ప్రీతీ ఏమాత్రం సహకరించదు అని అంటున్నాడు. తాను తీస్తున్న ‘విరాటపర్వం’ మూవీ ఉమెన్ హుడ్ కు ఒక నివాళి అంటూ ఈ సినిమా పై అంచనాలు పెంచుతున్న వేణు ఆశలు నెరవేరాలని ఆశిద్దాం..    

మరింత సమాచారం తెలుసుకోండి: