టాలీవుడ్ స్టార్ పెద్దగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. సేఫ్ గేమ్ కు ప్రియారిటీ ఇస్తున్నారు. రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించలేని కొత్త కథల కంటే.. ఆల్ రెడీ మంచి రిజల్ట్ తెచ్చుకున్న కథలనే రీమేక్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు. అందుకే కేరళ నుంచి హిట్ కథలను పట్టుకొస్తున్నారు. మలయాళం రీమేక్ లో నటిస్తున్నారు. 

 

సూపర్ హిట్స్ ను ముందే జడ్జ్ చేసే చిరంజీవి ఇప్పుడో మలయాళీ హిట్ లో నటించేందుకు సిద్ధమయ్యాడు. మోహన్ లాల్ టైటిల్ రోల్ ప్లే చేసిన లూసిఫర్ రీమేక్ చేయబోతున్నాడు చిరు. ఈ రీమేక్ ను సుజిత్ కు అప్పగించింది మెగా కాంపౌండ్. అయితే లూసిఫర్ తెలుగు రీమేక్ లో సుజిత్ చేసిన మార్పులు చేర్పులు చిరంజీవికి నచ్చలేదని.. డైరెక్టర్ ని మార్చే ఆలోచనలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. 

 

రామ్ చరణ్ మరో మలయాళీ మూవీ రైట్స్ ను తీసుకున్నాడు. పృథ్వీరాజ్ హీరోగా సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ రైట్స్ ని కొన్నాడు రామ్ చరణ్. ఇక ఈ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తాడని అప్పట్లో ప్రచారం జరిగింది కానీ.. పీకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. 

 

సితార ఎంటర్ టైన్ మెంట్స్ మరో మలయాళీ మూవీ రైట్స్ కూడా తీసుకుంది. కప్పెలా సినిమాను తెలుగులో తీయబోతున్నాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ రీమేక్ లో విశ్వక్ సేన్ నటిస్తాడని చెబుతున్నారు. ఇక ఇంతకుముందు ఈ హీరో మలయాళీ హిట్ అంగామలై డైరీస్ ను ఫలక్ నుమా దాస్ గా రీమేక్ చేశాడు. 

 

బాక్సాఫీస్ స్టోరీ ఎవరు రాశారు. ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాలు ఇంపార్టెంట్ కాదు. కథ బాగుందా లేదా అనేది మాత్రమే చూస్తుంది. స్టోరీ ఇంప్రెస్ గా ఉంటే సూపర్ హిట్ కట్టబెడుతుంది. లేదంటే పక్కన పెట్టేస్తుంది. అందుకే తెలుగు మేకర్స్ చాలామంది సూపర్ హిట్స్ కోసం రీమేక్స్ వైపు చూస్తున్నారు. 

 

సక్సెస్ కోసం చాలా రోజులుగా పోరాటం చేస్తున్న సుమంత్ కూడా ఓ మలయాళీ రీమేక్ కు సైన్ చేశాడు. మాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న గ్యాంగ్ స్టర్ కామెడీ డ్రామా పాదయోట్టం సినిమాను రీమేక్ చేయబోతున్నాడు సుమంత్. ఇక ఒరిజినల్ మూవీలో హీరోయిన్ గా నటించి ఐమా రుబి సెబాల్టియన్ ఈ రీమేక్ లో నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: