అక్కినేని నాగార్జున ఈ బ్రేక్ ను ఫుల్ గా వాడేసుకుంటున్నాడు. షూటింగ్ లు లేక చాలా ఫ్రీగా ఉన్న నాగార్జున, మళ్లీ ఇండస్ట్రీ మామూలు స్టేజ్ కు రాగానే స్పీడ్ పెంచాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఒక సినిమాను లైన్ లో పెట్టిన నాగ్, మరో ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నాడు. హిందీలో సూపర్ హిట్ అయిన సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడు.
నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ లో ఉన్నపుడు కరోనా లాక్ డౌన్ తో ఇండస్ట్రీ హాలిడేకు వెళ్లిపోయింది. సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. అన్ లాక్ 1.0తో షూటింగ్స్ కు పర్మీషన్స్ వచ్చినా కరోనా కేసులు పెరుగుతున్నాయని హీరోలంతా ఇంటికే పరిమితమయ్యారు. నాగార్జున కూడా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే ఈ ఫ్రీ టైమ్ ని కథల కోసం కేటాయిస్తున్నాడు నాగార్జున.
నాగార్జున ఈ కరోనా కాలంలోనే ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఓకే చేశాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పాడు. ఈ మూవీతో పాటు, మరో ప్రాజెక్ట్ ని లైన్ లో పెడుతున్నాడు నాగ్. హిందీలో అజయ్ దేవగన్, ఇలియానా లీడ్ రోల్స్ చేసిన రైడ్ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నాడు నాగ్. సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఈ రీమేక్ ను నిర్మించాలనుకుంటున్నాడట అక్కినేని స్టార్.
నాగార్జున సరైన హిట్ కొట్టి చాలా రోజులయింది. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టలేదు నాగార్జున. ఇక ఆఫీసర్, మన్మథుడు 2 ఫ్లాపులతో ఈ హీరో మార్కెట్ కూడా పడిపోయింది. అందుకే వరుస సినిమాలతో మళ్లీ ట్రాక్ ఎక్కాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ ట్రైల్స్ ఎంతవరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.
మొత్తానికి నాగార్జున సక్సెస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగా అలర్ట్ గా ఉంటున్నాడు. ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు. చూద్దాం ప్లాన్ ఏ విధంగా వర్కవుట్ అవుతుందో.