ఈ టైటిల్ చూసి కచ్చితంగా టైటిల్ లో పవన్ కళ్యాణ్ ఉండాల్సింది ప్రవన్ కళ్యాణ్ అని తప్పు పడ్డదని భావించొచ్చు. ఇక్కడ ప్రస్థావించేది పవన్ కళ్యాణ్ గురించే అయినా ఆర్జీవి మాటల్లో చెప్పాలంటే ప్రవన్ కళ్యాణ్ అన్నదే కరెక్ట్. పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వర్మ చేసిన సినిమా పవర్ స్టార్. ఇందులో పవన్ ను ప్రవన్ కళ్యాణ్ గా మార్చాడు ఆర్జీవి. సినిమా ట్రైలర్ చూసినవారంతా పవన్ పొలిటికల్ కెరియర్ మీద ఆర్జీవి సినిమా ఉంటుందని ఫిక్స్ అయ్యారు.   

 

ఆఫ్టర్ ఏపీ ఎలక్షన్స్ తర్వాత ప్రవన్ అదేనండి పవన్ కళ్యాణ్ ఎలా ఫీల్ అయ్యాడన్న కాన్సెప్ట్ తో ఈ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ చివర్లో పవన్ చెయిర్ లో దీర్ఘంగా ఆలోచిస్తున్న టైంలో చేతిలో బాటిల్ పట్టుకుని చిన్నగా వెనుకనుండి వచ్చి పవన్ ఎదుట కూర్చుకుంటాడు ఓ వ్యక్తి. అతని ఫేస్ రివీల్ చేయలేదు. అయితే ట్రైలర్ చూసిన వారంతా అది ఆర్జీవిని అని కనిపెట్టేస్తున్నారు. 

 

ఇంతకీ పవర్ స్టార్ సినిమాలో ఆర్జీవి ఎందుకున్నాడు. ప్రవన్ కళ్యాణ్ పాత్ర ద్వారా పవన్ కు ఆర్జీవి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాడు. వర్మ పవన్ కు హితబోధ చేస్తాడా అన్న రేంజ్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. అసలు సినిమాలో వర్మ ఎందుకు నటించాలని అనుకున్నాడు. పవర్ స్టార్ సినిమాలో ఆర్జీవి ఏం చెప్పబోతున్నాడు అన్న ఎక్సయిట్మెంట్ మొదలైంది. వర్మ తన సినిమా ట్రైలర్ తో ఆసక్తి పెంచడం కామనే.. అలానే పవర్ స్టార్ సినిమాపై కూడా ట్రైలర్ తో సినిమా ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి పెంచాడు. చివర్లో ఆర్జీవి కూడా కనిపిస్తాడని తెలిసి పవర్ స్టార్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.  మరి సినిమాను ఏం చేస్తాడో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: