‘ధడక్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కి విపరీతమైన పేరుతో పాటు ప్రశంసలు కూడ లభించాయి. దీనితో ఆమెకు అనేక ఆఫర్లు కూడ వచ్చాయి. అయితే ఆమె కరణ్ జోహార్ తో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అతడు నిర్మించే మూడు సినిమాలు పూర్తిచేసిన తరువాత మాత్రమే వేరే సినిమాలలో నటించే అవకాశం ఆమెకు ఏర్పడటంతో ఆమె అనేక ఆఫర్లు వదులు కోవలసి వచ్చింది.


ఈపరిస్థితుల మధ్య జాన్వీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడ అనేక ఆఫర్లు వెళ్ళడమే కాకుండా భారీ పారితోషికాలను ఆఫర్ చేసారు. అయితే అప్పట్లో ఆ అవకాశాలు అన్నింటినీ జాన్వీ తిరస్కరించింది. ఊహించని కరోనా పరిస్థితులు ఏర్పడటంతో జాన్వీ నటించిన ‘గుంజన్ సక్సేనా’ రిలీజ్ కేవలం ఓటీటీ ప్లాట్ ఫామ్ కు పరిమితం అయిపోయింది.


ఆమె నటిస్తున్న ‘రూహీ ఆఫ్ జానా’ మూవీ కూడ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో టాప్ హీరోయిన్ రేంజ్ కి ఎదుగుతుంది అని భావించిన జాన్వీ కెరియర్ ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ హీరోయిన్ గా మారిపోవడం ఆమెకు అదేవిధంగా ఆమె తండ్రి బోనీకపూర్ కు కలవర పాటు కలిగిస్తున్నట్లు టాక్.


ఈ పరిస్థితులకు తోడు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్స్ అలియా భట్ దీపికా పదుకొనె లు భారీ పారితోషికాలు తీసుకుంటూ తెలుగు సినిమాలలో నటిస్తున్న పరిస్థితులలో ఇప్పుడు జాన్వీ దృష్టి టాలీవుడ్ ఇండస్ట్రీ పై పడి ఒక భారీ సినిమా ద్వారా తాను కూడ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని తన తండ్రి బోనీకపూర్ ద్వారా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల టాలీవుడ్ లో భారీ సినిమాల నిర్మాణం బాగా తగ్గిపోయిన పరిస్థితులలో ఇప్పుడు ఆలస్యంగా జ్ఞానోదయం తెచ్చుకున్న జాన్వీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఎటువంటి స్పందన వస్తుంది అన్నవిషయం ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: