ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎస్. ఎస్. రాజమౌళి తీస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా, అలానే రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాలో పలువురు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర రంగాలకు చెందిన నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపుగా రూ. 450 కోట్ల భారీ ఖర్చుతో నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు, రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, మంచి స్పందన సంపాదించడంతో పాటు, సినిమా పై ప్రేక్షకుల్లో భారీ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసాయి.
అయితే కొద్దిరోజల క్రితం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ వీడియో వస్తుందని నందమూరి ఫ్యాన్స్ భావించారు. అయితే అది సాధ్యపడే అవకాశం చాలా వరకు తక్కువ అని, ఎందుకంటే సినిమాకు సంబందించిన ఫుటేజ్ అంతా తమ ఆఫీస్ లో ఉండిపోవడం, లాక్ డౌన్ కారణంగా సిబ్బంది ఎవరూ కూడా లేకపోవడంతో ఎన్టీఆర్ వీడియోని రిలీజ్ చేసే అవకాశం లేదని, అంతకు కొద్దిరోజుల ముందు నుండి,రాజమౌళి చెప్తూ వచ్చారు. ఫైనల్ గా అది కుదరకపోవడంతో ఇపటివరకు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియో ని రిలీజ్ చేయలేదు ఆర్ఆర్ఆర్ యూనిట్. ఇప్పుడు ఇదే నందమూరి ఫ్యాన్స్ ని కొంత ఆగ్రహానికి గురి చేస్తోందని సమాచారం. మరోవైపు చరణ్ పుట్టిన రోజున ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, సరిగ్గా మా హీరో దగ్గరకి వచ్చేసరికి రాజమౌళి ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు.
ఇప్పటికే ప్రభుత్వం లాక్ డౌన్ ని కొంత వరకు సరళించి చాలా రోజులు గడిచింది, అయినప్పటికీ కూడా మా హీరో ఫస్ట్ లుక్ కి సంబంధించి మీరు ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వకపోవడం ఏంటని వారు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రాజమౌళిని ఉద్దేశించి కామెంట్స్, చేస్తున్నారు. ఒకరికి న్యాయం, మరొకరికి అన్యాయ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ వారిలో ఇంకొందరు ప్రశిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో యూనిట్ అందరినీ సమీకరించి, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కి సంబందించిన వీడియో రిలీజ్ చేసే అవకాశం లేనందునే రాజమౌళి కూడా దానిపై ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదని, ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గ్రహించి, కొంత శాంతం వహిస్తే, రాబోయే మరికొద్దిరోజుల్లో ఆర్ఆర్ఆర్ యూనిట్ తప్పకుండా ఆయన ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు పలువురు సినీ విశ్లేషకులు.....!!