టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరు సుకుమార్. “రంగస్థలం” సినిమా తీసిన తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలాకాలంగా వెయిట్ చేసి, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోవడంతో అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నారు. “పుష్ప” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. కరోనా కారణంగా వచ్చే ఏడాది పుష్ప సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉండటంతో… మధ్యలో చాలా గ్యాప్ రావడంతో సుకుమార్ రిస్కు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

 

దాదాపు ఐదు నెలల గ్యాప్ రావడంతో సుకుమార్ తన జీవితంలో చూసిన 9 లవ్ స్టోరీలను వెబ్ సిరీస్ రూపంలో తెరకెక్కించడానికి డిసైడ్ అవుతున్నట్లు సమాచారం. ఈ 9 వెబ్ సిరీస్ లను తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ ల చేత సుకుమార్ తీయబోతున్నారట. ఒకపక్క దర్శకత్వం చేస్తూనే మరోపక్క ఈ  తొమ్మిది వెబ్ సిరీస్ లను స్వయంగా తానే నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పటికే ఒక ప్రముఖ ఓటిటి తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్న టైంలో ఇలాంటి వెబ్ సిరీస్ ప్రయోగాలు చేయడం వల్ల కెరియర్ పరంగా రిస్క్ అవుతుందని సుకుమార్ వీరాభిమానులు అంటున్నారు. ఇదిలా ఉండగా మరికొంతమంది ఇండస్ట్రీలో పేరున్న స్టార్ డైరెక్టర్లు ఎంతో మంది ఉన్నా…..  కొత్త టాలెంట్ ని సుకుమార్ మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నారని పొగుడుతున్నారు. అయినా గానీ స్టార్ డైరెక్టర్ అయ్యుండి వెబ్ సిరీస్ చేయడం అంటే కొంత రిస్కే అని సుకుమార్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: