సాధారణంగా పెద్ద పండుగలకు టాప్ హీరోల సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవుతూ ఉంటే ఆమూవీల రిజల్ట్ గురించి హీరోల అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమా ధియేటర్లు మూతపడి అసలు సినిమాల విడుదలే లేకపోయినా రేపు ఒకదాని పై ఒకటి పోటీ విడుదల అవుతున్న ‘పవర్ స్టార్’ ‘పరాన్నజీవి’ మూవీల పై ఆసక్తి అన్ని వర్గాలలోను చాల ఎక్కువగా ఉంటుంది. 


‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వం వహించిన ఈమూవీ పై పవన్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈమూవీలో రామ్ గోపాల్ వర్మను ఇమిటేట్ చేసే పాత్రలో ‘జబర్ధస్త్’ కమెడియన్ షకలక శంకర్ నటిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో విడుదలైన ‘పరాన్నజీవి’ ట్రైలర్ ని చూసి పవన్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు.


'వాడుకోవడం నాకు వోడ్కాతో పెట్టిన విద్య, లక్ష్మీ బాంబుతో బాబు గారినే మధనం చేశాను, శివంగి శ్రీరెడ్డిని సినిమా స్టార్ పై శివాలెత్తేలా చేశాను, కత్తి మహేష్ ని కత్తి దూసేలా చేశాను, స్క్రిప్ట్ నాది స్క్రీన్ ప్లే నాది, ఫైటింగ్ వాళ్ళది ఛీటింగ్ నాది, వాడుకోవడంలో వాయివరసలు లేవ్’ అంటూ వర్మ బాడీ లాంగ్వేజ్ తో షకలక శంకర్ చెప్పినా ఎందు చేతనో పవన్ అభిమానులు కనెక్ట్ కాలేకపోతున్నారు. దీనితో సినిమాను తీయడం రాకపోతే మానేయమని అనవసరంగా వర్మ బాడీ లాంగ్వేజ్ హైలెట్ చేసే విధంగా సినిమాలు తీయవద్దని గగ్గోలు పెడుతూ పవన్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


ఇది ఇలా ఉండగా తెలుస్తున్న సమాచారం మేరకు రేపు విడుదల కాబోతున్న పవర్ స్టార్ మూవీకి వర్మ కోరుకున్న స్థాయిలో పవన్ యాంటీ ఫ్యాన్స్ నుండి అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు మ్యానియా కనపడటం లేదు. దీనితో పవన్ యాంటీ ఫ్యాన్స్ కూడ ఈమూవీ యూట్యూబ్ లో ఉచితంగా విడుదల చేస్తే చూస్తారేమో కాని డబ్బులు కట్టి చూడరా అన్న సందేహాలు వస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: