ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులకు చాలచిరాకు కలిగించేరోజు. ఈరోజు వర్మ విడుదల చేస్తున్న పవర్ స్టార్ మూవీకి ఏరేంజ్ లో స్పందన వస్తుంది అన్నవిషయం బట్టి పవన్ కు ఉన్న యాంటీ ఫ్యాన్స్ సంఖ్య మరొకసారి రుజువు కాబోతోంది. ఈమూవీ పై పవన్ అభిమానులు తమ శక్తిమేరకు నిరశన తెలిపారు. అయితే గతంలో శ్రీరెడ్డి వివాదం తలెత్తినపుడు మెగాఫ్యామిలీ మొత్తంబయటకు వచ్చి నిరసన తెలిపారు. అల్లు అర్జున్ నాగబాబు అల్లు అరవింద్ వరుణ్ తేజ్ సాయి ధరమ్ తేజ్ అల్లు శిరీష్ లతో పాటు బన్నీవాసు లాంటివ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలబడ్డారు.


అప్పట్లో అల్లుఅరవింద్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ అనేకకామెంట్స్ చేసారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ మూవీ విషయంలో అంతటా మెగాఫ్యామిలీ నుండి నిశ్శబ్దమే కనిపిస్తోంది. వాస్తవానికి వర్మ పవర్ స్టార్ మూవీలో పవన్ కు సంబంధించిన అన్ని వ్యక్తిగతవిషయాలు అందరికీ అర్ధం అయ్యేలానే ప్రస్తావించాడు. ఇలాంటి వివిదాస్పద మూవీవిషయంలో తమ నిరశనకు మెగాఫ్యామిలీ నుండి ఎటువంటి సపోర్ట్ రాకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్ధంఅవ్వక పవన్ అభిమానులు ఆశ్చర్యపోతున్నట్లు టాక్.


దీనితో బురదలో రాళ్లువేస్తే తమమీదే పడుతుందని మెగాఫ్యామిలీ ఈవిషయాన్ని సైలెంట్ గా వదిలేసిందా లేక ఈవ్యూహం వెనుక మరేదైనా ఎత్తుగడ ఉందా అన్నకోణంలో ఇప్పుడు పవన్ అభిమానులు అంతర్మధనంలో ఉన్నారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఇంటర్యూ అంటూ మీడియాకు ‘జనసేన’ విడుదల చేసిన వీడియో పై కొందరు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జ‌న‌సేనాని మాత్ర‌మే కాదు ఆయ‌న టాలీవుడ్ అగ్ర‌హీరో.


ఇలాంటి పరిస్థితులలో  కేవ‌లం త‌న పార్టీ మీడియా హెడ్‌ తో ఇంట‌ర్వ్యూ చేయించుకుని కొన్ని ప్రశ్నలకు మొక్కుబడి సమాధానాలు ఇవ్వడంకంటే అదే ఫామ్ హౌస్ లో పవన్ భౌతిక దూరం పాటిస్తూ మీడియా ప్రతినిధులందరినీ పిలిచి తన మనసులోని భావాలు షేర్ చేసుకుంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే మీడియాతో ప్రత్యక్షంగా పవన్ మాట్లాడితే ‘ప‌వ‌ర్‌స్టార్‌’పై సంబంధించి మీడియా అడిగే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్ప‌డానికి ప‌వ‌న్ భ‌య‌ప‌డి ఇలా ముందుగా రికార్డు చేసిన ఇంటర్వ్యూలను పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 లుగా ఇలా బయటకు వదులుతూ పవన్ కూడ రామ్ గోపాల్ వర్మను కెలుక్కోవడం ఇష్టంలేక ఇలా మౌనం కొనసాగిస్తూ పవర్ స్టార్ మూవీని ఇగ్నోర్ చేస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: