సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడం ఏమో కాని కాంట్రవర్షియల్ సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. లాక్ డౌన్ టైంలోనే క్లైమాక్స్, నగ్నం సినిమాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన వర్మ ఈరోజు పవర్ స్టార్ సినిమాను రిలీజ్ చేశాడు. పవన్ కళ్యాణ్ టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా ప్రమోషన్స్ బీభత్సంగా చేసినా సరే ఈరోజు రిలీజైన ఈ సినిమా సందడి ఎక్కడ కనిపించడం లేదు.  

 

సినిమా తీయడం రిలీజ్ చేయడం.. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఆలోచించకపోవడం ఇది వర్మ స్టైల్.. నిన్నటిదాకా పవర్ స్టార్ సినిమా కోసం హడావిడి చేసిన ఆర్జీవి ఆ సినిమా రిలీజ్ అయ్యింది కాబట్టి ఇక ఇప్పుడు ఆ మ్యాటర్ వదిలిపెట్టి నెక్స్ట్ సినిమా మీద దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే వర్మ డైరక్షన్ లో థ్రిల్లర్ సినిమా రాబోతుంది. ఇదే కాకుండా నగ్నం 2ని తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. 

 

నగ్నం సినిమాలో శ్రీ రాపాకని ఓ రేంజ్ లో వాడిన ఆర్జీవి నెక్స్ట్ చేయబోతున్న నగ్నం 2లో శ్రీ సుధని సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో కొన్నాళ్లుగా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చిన శ్రీ సుధ అర్జున్ రెడ్డి, రూలర్ లాంటి సినిమాల్లో నటించింది. ఈమధ్య సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు మీద కేసు వేసి వార్తల్లో నిలిచింది. నగ్నం 2 శ్రీ సుధ నటించదం కన్ఫాం అయితే మాత్రం ఇన్నాళ్ళు తెచ్చుకోలేని క్రేజ్ ఈ ఒక్క సినిమాతో తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. సినిమాటోగ్రాఫర్ తో గొడవ వల్ల ప్రేక్షకుల్లో ఎలాగు ఫేమస్ అయిన ఈ అమ్మడితో వర్మ నగ్నం 2 చేస్తే మాత్రం అదిరిపోతుందని అంటున్నారు.                
      

మరింత సమాచారం తెలుసుకోండి: