ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన సమంత అక్కినేని నేటికీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 11 మిలియన్ల ఫాలోవర్లను సాధించి సౌత్ హీరోయిన్లలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న నటీమణిగా అరుదైన రికార్డును నెలకొల్పారు. తన బుజ్జి కుక్కపిల్ల హాష్ తో గడిపిన క్షణాల నుండి తన భర్త నాగచైతన్య తో గడిపిన రొమాంటిక్ మూమెంట్స్ వరకు అన్ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సమంత అక్కినేని షేర్ చేస్తూ తన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ బాగా అలరిస్తున్నారు. తన ఫోటో షూట్ కి సంబంధించిన అందమైన చిత్రాలను, యోగాసనాలకు సంబంధించిన చిత్రాలను, వ్యాయామం చేస్తున్న ఫోటోలను, వీడియోలను ఇలా ప్రతి ఒక్కటీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకునే సమంత అక్కినేని కి దక్షిణ భారతదేశంలో ప్రతి మూలా వీరాభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
తాజాగా ఆమె 11 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా 2010వ సంవత్సరం నుండి 2020 వ సంవత్సరం వరకు అనగా 11 సంవత్సరాలలో తాను భౌతికంగా ఎలా మారారో వీడియో రూపంలో తెలియజేసారు. అయితే ఈ పోస్ట్ కి ఆమె... 'బెస్ట్ జర్నీ విత్ బెస్ట్ పీపుల్... మై ఫరెవర్ టీం. ఎన్నో ఒడిదుడుకులు, మంచిచెడు విషయాల్లో మీరు ఎలా అయితే నాకు అండగా ఉన్నారో నేను కూడా మీకోసం అదే స్థాయిలో అండగా ఉన్నానని ఆశిస్తున్నాను', అనే క్యాప్షన్ పెట్టారు.
అయితే ఈ పోస్ట్ ని కేవలం 4 గంటల్లోనే 8 లక్షల మంది అభిమానులు లైక్ చేశారు. ఆమె 11 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ ని చేరుకున్న సందర్భంగా అభిమానులంతా కంగ్రాచ్యులేషన్స్ కూడా తెలుపుతున్నారు. కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా అభినందనలు చెప్పి ఇలాగే ఇంకా ఎన్నో అరుదైన రికార్డులు నెలకొల్పాలని ఆశించారు. ఏది ఏమైనా ఈ లాక్ డౌన్ సమయంలో సమంతా అక్కినేని ని చాలామంది సినీ ప్రేక్షకులు ఫాలో అయ్యారు. 10 మిలియన్ ఫ్యాన్ ఫాలోయింగ్ మార్క్ ని చేరుకొని... సెలబ్రేట్ చేసుకున్న సమంత అక్కినేని కేవలం రెండు నెలల వ్యవధిలోనే 11 మిలియన్ మార్క్ ని చేరుకున్నారు.