పవన్ కళ్యాణ్ వర్సెస్ ఆర్జీవీ ఫైట్ ముదిరి పాకాన పడింది. వర్మ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ జీవితంలోకి వెళ్లి.. పవర్ స్టార్ మూవీ తీశాడు. వర్మ జీవితాన్ని బయటకు లాగుతూ.. పవన్ ఫ్యాన్ నూతన్ నాయుడు పరాన్న జీవి మూవీ తీశాడు. మెగా ఫ్యాన్స్ వర్సెస్ ఆర్జీవీ ఫైట్ లో ఈ ఇద్దరికి చెందిన కామన్ అభిమాని నలిగిపోయాడు. 


పరాన్న జీవిలో కమెడియన్ షకలక శంకర్ ఆర్జీవీగా నటించాడు. స్వతహాగా పవన్ ఫ్యాన్ అయిన ఈ కమెడియన్ కు వర్మ అన్నా అంతే అభిమానం. ఆర్జీవిని డిటో దింపేసి ఇమిటేషన్ తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. సత్య2 సినిమా ఆడియో ఫంక్షన్ లో వర్మ ముందే ఇమిటేట్ చేశాడు. ఆరాధ్య దర్శకుడిని టార్గెట్ చేస్తూ.. నటించాల్సి వస్తుందని శంకర్ అనుకొని ఉండడు.


పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకున్న వర్మ చాలా కాలంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ వచ్చాడు. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు తీసిన ఆర్జీవీ పవర్ స్టార్ మూవీ తీశాడు. వర్మ మాటలతో.. చేష్టలతో పవన్ ఫ్యాన్స్ విసిగిపోయారు. అభిమాని నూతన్ నాయుడు రామూను టార్గెట్ చేస్తూ.. పరాన్న జీవి మూవీ తీశాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి ఈ రోజు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.  

 

పవన్.. వర్మ రెండు కళ్లు అని చెప్పుకునే షకలక శంకర్ ఆర్జీవీ పరువు తీస్తూ.. నటించాల్సి వస్తుందని అనుకోలేదు. పరాన్న జీవిలో ఆర్జీవీ యూటి ట్యూడ్ లోనే కాదు.. వ్యక్తిగత జీవితాన్ని కూడా రోడ్డుమీదకు లాగే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 

 


శాంపిల్ గా టీజర్ చూసినోళ్లకు అర్థమైపోయింది. ఇప్పటికీ వర్మ అభిమానినేనని.. కాకపోతే .. రంగీలా.. శివ.. సర్కార్ లాంటి మూవీస్ ఆర్జీవీ నుంచి రావడం లేదన్న బాధను వ్యక్తం చేస్తున్నాడు షకలక శంకర్. వర్మ అంటే ఇప్పటికీ గౌరవంతోనే ఉన్నా.. అభిమాన దర్శకుడి గాలి తీయాల్సి వచ్చిందన్న ఫీలింగ్ అయితే శంకర్ లో కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: