ఇక ఇటీవలే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన బయోపిక్ తెరకెక్కించి వర్మ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే తన సినిమాలపై ఎవరేమనుకున్నా ఎన్ని తిట్లు తిట్టిన వర్మ మాత్రం అవన్నీ పట్టించుకోడు.. తాను ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేసి చూపిస్తాడు.కాగా వర్మ తెరకెక్కించిన పవన్ కళ్యాణ్ సినిమా నేడు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమిటి అన్న దానిపై ప్రస్తుతం ఎంతో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పవర్ స్టార్ ను టార్గెట్ చేస్తూ సినిమా తీసిన నేపథ్యంలో ఇండస్ట్రీలో మొత్తం వర్మ పేరే వినిపిస్తోంది.
కాగా వర్మ తర్వాత సినిమా లో ఓ యువ హీరో జీవితం గురించి తీయబోతున్నారు అని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. అకాల మరణంతో అభిమానులందరినీ విషాదంలోకి నెట్టి.., ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఉదయ్ కిరణ్ జీవిత కథనే వర్మ తర్వాత సినిమాగా ప్లాన్ చేస్తున్నారని ప్రస్తుతం టాలీవుడ్ ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కూడా మెగా ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తున్నారు అని సమాచారం. మాములుగా సినిమాలోని పాత్రలు అన్నింటికి నిజజీవిత పాత్రలు దగ్గరగా పోలికలు ఉండే విధంగా నటులు తీసుకొస్తారు వర్మ . మరి ఈ సినిమా కోసం ఉదయ్ కిరణ్ పోలికలతో ఉన్న వ్యక్తిని తీసుకొస్తారా అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
Powered by Froala Editor