లాక్ డౌన్ కారణంగా అందరూ నష్టపోయిన వాళ్లే. ఈ నష్టం కొందరికి ఎక్కువగా మరొకరికి తక్కువగా ఉంది. అయితే కరోనా హాలిడేస్ ను ఉపయోగించుకొని కొందరు కెరీర్ లో సాధించలేమనుకున్నది సాధించారు. 

 

సమంత.. కాజల్.. తమన్నా.. వెయిట్ తగ్గుతారే గానీ.. పెరగరు. ఒకవేళ కాస్త వెయిట్ గెయిన్ అయినా.. వెంటనే కరగదీస్తారు. అయితే మరికొందరి పరిస్థితి అలా కాదు. పెరిగిన వెయిట్ ను చాలా తగ్గించాలని ట్రై చేస్తున్నా.. తీరిక దొరక్క.. పెద్దగా కాన్సన్ ట్రేషన్ చేయక బొద్దు గానే కనిపిస్తున్నారు. ఈ జాబితాలో ఉన్న ఇలియానా రీసెంట్ గా పోస్ట్ చేసిన స్టిల్స్ .. వీడియోల్లో సన్నగా కనిపించింది. 

 

ప్రియుడితో బ్రేకప్ తర్వాత ఆఫర్స్ కోసం ట్రై చేస్తే.. ఒక్క ఆఫర్ దక్కలేదు. దీనికి తన బొద్దుతనమనే కారణమని చెబుతున్న ఇలియానా తగ్గాలని నిర్ణయించుకుంది. కొన్ని నెలలుగా ట్రై చేసినా.. ఫలితం దక్కలేదు. ఎట్టకేలకు లాక్ డౌన్ పుణ్యమా అని.. నార్మల్ వెయిట్ కు వచ్చేసింది ఇలియానా.. ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న టైమ్ లో ఇలా సన్నబడి తనని తాను కొత్తగా పరిచయం చేసుకుంది ఈ గోవా బ్యూటీ. 

 

బొద్దుగా కనిపించే వరలక్ష్మి శరత్ కుమార్.. కరోనా సమయంలో సన్నబడింది.ఆన్ లైన్ లో శిక్షణ తీసుకొని మరీ వెయిట్ తగ్గింది. రీసెంట్ గా ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోల్లో గుర్తుపట్టలేనంతగా కనిపిస్తోంది వరలక్ష్మి. ఓవర్ వెయిట్ కారణంగానే.. హీరోయిన్ ఆఫర్స్ కు దూరమైన ఈ నట వారసురాలు మళ్లీ కథానాయిక ఇమేజ్ సంపాదించుకుంటుందో చూడాలి. 

 

అందరి కథ ఒకటైతే.. బాలీవుడ్ భామ కృతి సనన్ వెయిట్ లాస్ స్టోరీ మరోలా ఉంది. మహేశ్ నేనొక్కడితో వెండితెరకు పరిచయమైన కృతి సనన్ బాలీవుడ్ కు వెళ్లినా.. ఒకే రకమైన వెయిట్ కంటిన్యూ చేసింది. అయితే.. ఓ క్యారెక్టర్ కోసం 15కేజీలు పెరగాల్సి వచ్చినా.. లాక్ డౌన్ టైమ్ లో పెరిగిన వెయిట్ దాదాపు తగ్గి మళ్లీ నార్మల్ కు వచ్చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: