ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకదిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి మూవీ అనౌన్సుమెంట్ వచ్చిన దగ్గరినుండి, అసలు ఆ సినిమా ఎలా ఉండబోతోంది, సినిమాలో మహేష్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేటువంటి చర్చలు కొద్దిరోజలుగా టాలీవుడ్ జనాల్లో విపరీతంగా జరుగుతున్నాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె. ఎల్. నారాయణ నిర్మాతగా ఎంతో భారీ ఖర్చుతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాక్. ఇటీవల వరుసగా మూడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుని కెరీర్ లో హ్యాట్రిక్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్, దాని తరువాత అతి త్వరలో సర్కారు వారి పాట మూవీలో నటించనున్నారు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ తో ఎంతో బిజీగా ఉన్నారు రాజమౌళి. వీటి అనంతరం మహేష్, రాజమౌళి ల సినిమా పట్టాలెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల లాక్ డౌన్ సమయంలో తండ్రి విజయేంద్రప్రసాద్ తో పలు కథలను చర్చించిన రాజమౌళి, అన్ని వర్గాలను ఆకట్టుకునే మంచి మాస్, కమర్షియల్ కథతో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట. అత్యంత భారీ లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం పలువురు దిగ్గజ టెక్నీషియన్స్ ని తీసుకోనున్నట్లు టాక్. ఇక ముఖ్యంగా సినిమాలో మహేష్ కు జోడిగా నటించబోయే హీరోయిన్ కు సంబంధించి పలువురి పేర్లు కొద్దిరోజులుగా ప్రచారం అవుతున్నాయి.
ముందుగా బాలీవుడ్ నటి దీపికా పదుకొనే పేరు ప్రముఖంగా ప్రచారమవ్వగా, ఆ తరువాత శ్రద్దా కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే వారిద్దరూ రాబోయే రోజుల్లో ఫుల్ గా బిజీగా ఉండడంతో వారి స్థానంలో మరొక నటి ఆలియా భట్ ని తీసుకోవాలని చూస్తున్నారట రాజమౌళి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తున్న ఆలియా అయితేనే, మహేష్ కు సరైన జోడి అని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, రెండవ సారి కూడా ఆలియాకి, రాజమౌళి సినిమాలో ఛాన్స్ లభించినట్లే .....!!