
ప్రస్తుతం కరోనా కారణంగా చిన్న జలుబు వచ్చినా ప్రాబ్లమే. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలు చాలా ఎక్కువ. కరోనా లక్షణాలు సీజనల్ వ్యాధులు ఒకేలా ఉండటంతో జ్వరం, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చినా కరోనా వచ్చిందని కొందరు భయాందోళనకు చెందుతున్నారు. కోవిడ్-19 యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించుకున్న తర్వాతే కరోనా లేదని తెలిసి హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు.
అయితే తాజాగా నటి లావణ్య త్రిపాఠి సంచలన విషయాలను వెల్లడించింది. ఈ మధ్య తనకు ఎదురైన ఓ సమస్య గురించి బహిరంగంగా తన అభిమానులకు చెప్పుకొచ్చింది. ఆ మాటలు విన్నాక తన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి లోనయ్యారు.
విషయం ఏమిటంటే.. లాక్ డౌన్ ప్రారంభం నుంచి నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్ లోనే ఉంటోంది. కరోనా కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లింది. తన సొంతూరైన డెహ్రాడూన్ కు వెళ్లే క్రమంలో విమానంలో ఎదుర్కొన్న సమస్య గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. జర్నీ సమయంలో మాస్క్, శానిటైజర్, పీపీఈ కిట్ ను కూడా క్యారీ చేసినట్లు ఆసక్తికరంగా చెప్పింది.
పీపీఈ కిట్ ను ధరించుకుని ఎయిర్ పోర్ట్ కు బయలు దేరింది. కిట్ ధరించిన కారణంగా వైరస్ నుంచి ఎలాంటి భయం ఉండదని నమ్మి విమానం ఎక్కింది లావణ్య. రెండున్నర గంటల ప్రయాణం చేయడంతో తనకు గాలి కూడా సరిగ్గా ఆడలేదని చెప్పుకొచ్చింది. మాస్క్ తో పాటు పీపీఈ కిట్ ను ధరించడంతో తనకు బ్రీతింగ్ సమస్య నెలకొందని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఇంటికి చేరుకున్నాక, ఇంట్లో వాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం గానీ, హగ్ చేసుకోవడం కానీ చేయలేదన్నారు. సామాజిక దూరం పాటిస్తున్నానని చెప్పారు. చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట తినడం ఆనందంగా అనిపించిందని చెప్పారు లావణ్య.