కొన్ని సినిమాలు విడుదలకు మందు భారీ హైప్ క్రియేట్ చేస్తాయి. ఇందుకు కాంబినేషన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాంటి అంచనాలతోనే సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన సినిమా ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమాపై బిజినెస్ సర్కిల్స్ లో, ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇందుకు విజయ్ దేవరకొండ స్టార్ ఇమేజ్, రష్మికతో స్క్రీన్ ప్రెసెన్స్ కారణం. పైగా మైత్రీ మూవీస్ సంస్థలో నిర్మాణం. ఇన్ని అంశాలతో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద మిస్ ఫైర్ అయింది. భరత్ కమ్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2019 జూలై 26న విడుదలైంది.
అంచనాలకు తగ్గట్టే ఓపెనింగ్ కలెక్షన్స్ అదరగొట్టేశాయి. కానీ.. మొదటిరోజు సందడి తర్వాత రీక్రియేట్ కాలేదు. కాలేజీ అలరి, స్టూడెంట్ పాలిటిక్స్, క్యాంపస్ గొడవలు.. ఇవన్నీ ఓల్డ్ కంటెంటే అయినా ఈ జనరేషన్ కు మళ్లీ పరిచయం చేశాడు. సెకండాఫ్ మెయిన్ కథను యూత్ ఆలోచనలకు ప్రతిబింబంగా తెరకెక్కించాడు. సినిమాలో పది నిముషాలు ఎడిట్ చేసుంటే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అప్పటికే పరిస్థితులు చేయి దాటిపోయాయి. సినిమా యూత్ కనెక్ట్ అయ్యేలా తీసి మెప్పించాడు దర్శకుడు భరత్ కమ్మ. అయితే.. కొన్నిసార్లు బలమైన కారణాలు లేకపోయినా ఫలితం తారమారవుతుంది.
గీత గోవిందం తర్వాత విజయ్, రష్మిక మరోసారి ఆకట్టుకున్నారు. జస్టిన్ ప్రభాకర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరింగ్ సినిమాకు ప్రాణం. కానీ.. ఇవేమీ సినిమాను కాపాడలేదు. మంచి సినిమాగా క్రిటిక్స్ మెచ్చుకున్నా.. ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. పాన్ ఇండియా కంటెంట్ ఉండటంతో సౌత్ లాంగ్వేజెస్ తో పాటు హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేసారు. సినిమా రిలీజై ఏడాది కావడంతో సినిమాలోని ఓ కలలా పాటను.. సింగర్స్ బాంబే జయశ్రీ, విజయ్ ఏసుదాస్ రీమిక్స్ చేసి రిలీజ్ చేశారు.
'O Kalala Kathala' Reprise Version ft. the exquisite singers bombay Jayashri & vijay Yesudas
— Mythri movie Makers (@MythriOfficial) July 26, 2020
Music par excellence by @justin_tunes#1YearForDearComrade
A film by @bharatkammahttps://t.co/69kJ61Q1EA@TheDeverakonda @iamRashmika