అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యచ్ లర్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎడిటింగ్ టేబుల్ మీద నాగార్జున ఎడిటింగ్ నాగార్జున సమక్షంలో జరుగుతుందని తెలుస్తుంది.  

 

తీసిన మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీ చేస్తున్నాడు. ప్రచార చిత్రాలతో సినిమాపై సూపర్ బజ్ ఏర్పడేలా చేస్తున్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాతో ఎలాగైనా టార్గెట్ రీచ్ అయ్యేలా ఉన్నాడు. కరోనా క్రైసిస్ వల్ల థియేటర్లు ఇప్పుడప్పుడే ఓపెన్ అయ్యే ఛాన్సులు లేవు. అందుకే కొన్ని సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి.  

 

అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాను కూడా ఓటిటి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఈ ఆలోచనని నాగార్జున ముందు ఉంచగా బ్యాచ్ లర్ మేకర్స్ మీద నాగ్ ఫైర్ అయినట్టు తెలుస్తుంది. లేట్ అయినా సరే అఖిల్ సినిమా థియేటర్ లోనే రిలీజ్ చేయాలని చెప్పారట. అంతేకాదు నాగార్జున సూచనల మేరకే ఈ సినిమా అవుట్ పుట్ ఉండబోతుందని తెలుస్తుంది. మరి అఖిల్ హిట్ కోరికని బ్యాచ్ లర్ సినిమా అయినా నెరవేరుస్తుందో లేదో చూడాలి.                                                   

మరింత సమాచారం తెలుసుకోండి: