సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు... దర్శకుడు శేఖర్ కపూర్ అండగా నిలిచారు. అంతేకాదు... ఆస్కార్ సాధించడమంటే... బాలీవుడ్‌లో మృత్యువుని ముద్దాడడమేనంటూ ఘాటుగా స్పందించారు. ఆస్కార్ సాధించడం వల్లే నీకా సమస్య ఎదురైందని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై రహమాన్ స్పందించారు. జీవితంలో విలువైన కాలం పోతే తిరిగి రాదని... మనం చేయాల్సిని ముందుకు సాగిపోవడమేనంటూ కామెంట్ పోస్టు చేశారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై ఓ బాలీవుడ్‌లో రచ్చ నడుస్తూనే ఉంది. దీనిపై కేసు కూడా నమోదు కావడంతో పలువుర్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మ్యూజిక్ మెజీషియన్ ఏఆర్ రహమాన్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్స్... మరింత అగ్గి రాజేసింది. తనకు అవకాశాలు రాకుండా ఓ గ్రూప్ అడ్డుపడుతోందంటూ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేయడంపై దర్శకుడు శేఖర్ కపూర్ స్పందించారు. రెహమాన్‌కు మద్దతుగా నిలిచారు.
రెహమాన్ ఆ సమస్య నీకు ఎందుకు వచ్చిందో చెప్పనా... ఆస్కార్ సాధించడం వల్లే అన్నారు శేఖర్ కపూర్. ఆస్కార్ సాధించడమంటే బాలీవుడ్‌లో మృత్యువుని ముద్దాడడమే అన్నారు. బాలీవుడ్ హ్యాండిల్ చేయలేనంత ప్రతిభ నీలో ఉంది అని స్పష్టం చేశారు శేఖర్ కపూర్.
దర్శకుడు శేఖర్ కపూర్ కామెంట్స్‌పై రెహమాన్ ప్రతిస్పందించారు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు... పేరు పోయినా సంపాదించుకోవచ్చు... కానీ విలువైన సమయాన్ని వృధా చేస్తే... తిరిగి రాదన్నారు రెహమాన్. మన చేయాల్సింది ఇంకా చాలా ఉందని... అందువల్ల ముందుకు సాగిపోవాలన్నాడు రెహమాన్.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు రెండు ఆస్కార్ అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడుగా రెహమాన్ రికార్డు సృష్టించారు. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లిన ఘనత ఆయనకే దక్కుతుంది. అయితే, రహమాన్‌కు కూడా అవకాశాలు రాకుండా కొందరు అడ్డుపడడంతో హిందీ సినిమా పరిశ్రమలో ఏం జరుగుతోందనే ప్రశ్నలకు తెరలేపింది.