అక్రమంగా ముందుకు వచ్చిన చైనాను తమ యధాస్థితికి వెళ్లాలి అంటూ భారత్ ఎన్నోసార్లు చర్చల్లో తెలిపింది. సీనియర్ సైన్యాధికారులు సైతం చర్చించారు. కానీ చైనా తీరు మాత్రం మార్చుకోవడం లేదు. వెనక్కి వెళ్లినట్లు నాటకాలు ఆడుతూ నే మళ్లీ మళ్లీ మోహరింపు లకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిందే చేస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పారు అని అంటారా... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమాలో మంచి గెలవనప్పుడు ఎలాగైనా యుద్ధం చేయాల్సిందే అని అర్థం ఉంటుంది. ఈ సినిమాలోని ఒక పాటలో కూడా ధర్మం గెలవని చోట... తప్పదు కత్తుల వేట.. తప్పో ఒప్పో సంహారం తర్వాతే.. అంటూ చెప్పారు జూ ఎన్టీఆర్.
ఇప్పుడు ప్రస్తుతం చైనా విషయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇదే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ధర్మంగా ఎన్నోసార్లు చర్చలు జరిపి వెనక్కి వెళ్లాలంటు కోరారు. ఎన్నోసార్లు శాంతియుతంగా వివాదాన్ని సద్దుమణిగేలా చేయాలని ప్రయత్నించారు. కానీ చైనా వినిపించుకోలేదు దీంతో ప్రస్తుతం యుద్ధానికి సిద్ధం అయిపోయింది భారత్. ఇప్పటికే భారత సరిహద్దుల్లో భారీగా ఆయుధాలను విమానాలను సైనికులను మోహరిస్తోంది. ఇక ధర్మం గెలవని చైనా సరిహద్దుల్లో.. తప్పదు శత్రు సంహారం అనే విధంగా ప్రస్తుతం మోడీ అడుగులు వేస్తున్నారు.
Powered by Froala Editor