మిల్కీ బ్యూటీ తమన్నాకు పెళ్ళి కొడుకు దొరకడంలేదని ఈమధ్య బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా తమన్నానే చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో ఒక డైరెక్టర్ తో ఎఫైర్ నడుపుతోంది అని గాసిప్స్ వస్తున్న నేపధ్యంలో ఈ అమ్మడి తల్లిదండ్రులు వరుడి వేటలో బిజీగా ఉన్నారట.
ప్రస్తుతం తమ్మూ తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలో కూడా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడ ఈమె హవా ఉంది. ఒకపక్క మూడు బాషలలో సినిమాలతో బిజీగా ఉండగానే పెళ్లి ఎందుకు అనుకుంటున్నారా? అయితే తమన్నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది నిజమే కానీ ఇప్పటి విషయం కాదట. గత రెండేళ్ళగా ఈ అమ్మడికి పేరెంట్స్ సంబంధాలను చూస్తూనే ఉన్నా సరైన జోడిమాత్రం కుదరడం లేదట.
ఎప్పటకైనా సరైన జోడి కుదురుతుందేమోనని ముందునుండీ తమ్మూ పేరెంట్స్ అదే పనిలో ఉన్నారట. తమ కూతురికి వీలైనంత త్వరగా పెళ్లి చేసి ఒక ఇంటి కోడలిగా పంపాలి అని తమాన్నా తల్లితండ్రులు ప్రయత్నాలు చేస్తుంటే వచ్చిన పెళ్ళి కొడుకులు ఎవ్వరు తనకు నచ్చడం లేదని తమ్మూ అంటోందట.
అంతేకాదు ఈ బిజీ షెడ్యూల్ లో పెళ్ళికి టైం ఎక్కడా అంటు మీడియాకే ఎదురు ప్రశ్నలు వేస్తోంది తమన్నా. ఇన్ని విషయాలు తెలిసుండి పెళ్ళికొడుకు వేటలో ఎందుకు ఉన్నారో తమన్నా తల్లితండ్రులకే తెలియాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: