ఆ తరువాత ఆమెకు టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్. ఎస్. రాజమౌళి దర్సకత్వంలో తెరకెక్కిన ఈగ సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో సుదీప్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మొత్తంలో మనం కొంత జాగ్రత్తగా గమనిస్తే, సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో సమంత లుక్ లో కొద్దిపాటి మార్పు గమనించవచ్చు. అయితే ఈ విషయమై అప్పట్లో కొన్ని వార్తలు విపరీతంగా ప్రచారం అయ్యాయి. ఈగ షూటింగ్ మొదలెట్టిన కొద్దిరోజుల తరువాత సమంత ఒకరకమైన చర్మ సంబంధ వ్యాధితో బాధపడ్డట్లు సమాచారం.
అందువలన ఆ సినిమా షూటింగ్ కూడా చాలా రోజులు వాయిదా పడడం కూడా జరిగింది. ఆరోగ్యం కుదుటపడిన తరువాత మళ్ళి షూటింగ్ లో జాయిన్ అయిన సమంత పేస్ లో కొద్దిపాటి మార్పు వచ్చింది. ఆ తరువాత దానిపై వచ్చిన వార్తలకు సమంత సమాధానమిస్తూ, తనకు అరుదైన చర్మ సంబంధ వ్యాధి వచ్చిన మాట వాస్తవమేనని, అయితే నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో తాను ట్రీట్మెంట్ తీసుకోవడం వలన దాని నుండి బయటపడ గలిగానని ఆమె అన్నారు. అయితే ఆ వ్యాధి బారిన పడినపుడు తాను కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తనకు తోడుగా ఉండి, ఆత్మస్థైర్యాన్ని అందించారని కూడా ఆమె అన్నారు.....!!