ఇక ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ మూవీలో హీరోగా నటిస్తున్న ప్రభాస్, దీని అనంతరం మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై పాన్ వరల్డ్ రేంజ్ లో అత్యున్నత సాంకేతిక విలువలతో, అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కనున్న ఈ సినిమా, ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాల అనంతరం, మరొక రెండు భారీ ప్రాజెక్టులను కూడా ప్రభాస్ లైన్లో పెట్టినట్లు చెబుతున్నారు. టాలీవుడ్ కు చెందిన ఒక బడా స్టార్ డైరెక్టర్, అలానే మరొక బాలీవుడ్ యంగ్ డైరెక్టర్, ఇటీవల ప్రబస్ ను కలిసి కథలు విపినించడం జరిగిందట. అయితే వారిద్దరి నుండి కథలు విన్న ప్రభాస్, అవి ఎంతో నచ్చడంతో మరికొద్ది రోజులు ఆగి వాటి గురించి అనౌన్స్ చేసి, పక్కగా కాల్షీట్స్ కేటాయిస్తానని చెప్పారట.
అందుతున్న సమాచారాన్ని బట్టి, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ రెండు సినిమాలు కూడా పట్టాలెక్కి ఛాన్స్ ఉందని, అలానే వీటితో పాటు మరో ఇద్దరు బడా దర్శకులు కూడా ప్రభాస్ లిస్ట్ లో ఉన్నారని, మొత్తంగా చూసుకుంటే ప్రభాస్ ఫ్యూచర్ మూవీ ప్లానింగ్స్ నిజంగా అదుర్స్ అనే రేంజ్ లో దూసుకెళ్తున్న ట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమాలతో ప్రభాస్ ఏ రేంజ్ సక్సెస్ ని అందుకుంటారో చూడాలి.....!!