అయితే ఒకప్పుడు ఆయన సినిమాలు తీసిన విధానానికి, ఇప్పుడు సినిమాలు తీస్తున్న విధానానికి చాలా మార్పు ఉందని, అప్పట్లో ఆయన తీసిన సినిమాలు సంచలన విజయాలు అందుకోవటానికి ఆయన ఎంచుకున్న ఆకట్టుకునే కథలు కారణం అని అంటున్నారు. కాగా ఇటీవల పలు వివాదాస్పద అంశాలను ఎంచుకుని తీసుకుని సినిమాలు తీస్తున్నందువల్లనే అవి సక్సెస్ కావడం లేదు అని కొందరు ప్రేక్షకులు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం, పవర్ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వర్మ, అతి త్వరలో మర్డర్, థ్రిల్లర్, కరోనా వైరస్ అనే మరొక మూడు సినిమా లను తన ఆర్జీవి థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు. కాగా వాటిలో, రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ ట్రైలర్ పై పలువురు నెటిజన్లు విచిత్రంగా కామెంట్స్ చేస్తున్నారు. నూతన నటీనటులు అప్సర రాణి, రాక్ కచ్చి నటించిన ఈ మూవీ ట్రైలర్ లో హీరోయిన్ అప్సర రాణిని రకరకాల కెమెరా యాంగిల్స్ లో చూపించారు వర్మ.
హీరోయిన్ ని ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి తరుముతూ ఉండటం, అయితే అతను మనిషా లేక ఏదైనా దెయ్యమా, పిశాచమా అనేటువంటి కొంత ఆసక్తి కలిగించేలా ట్రైలర్ సాగింది. ముఖ్యంగా అయితే ట్రైలర్లో అప్సర రాణిని వీలైనన్ని రకాలుగా పలు విధాలైన యాంగిల్స్ లో చూపడం, మధ్యలో హీరోతో ఆమె రొమాన్స్ వంటి సీన్స్ పై పలువురు నెటిజన్లు, అయ్యా వర్మ ఏంటయ్యా మాకు ఈ కర్మ, అసలు ఆ ట్రైలర్ ఏంటి, హీరోయిన్ ని ఆ యాంగిల్స్ లో ఆ చూపించడం ఏంటి, అంటూ పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు....!!