ఇక ఇటీవల కొన్నాళ్లుగా పలు వివాదాస్పద అంశాలు తీసుకుని సినిమాలు తీస్తూ కొనసాగుతున్న వర్మ, ఇటీవల పవర్ స్టార్ పేరుతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఒక సినిమా తీశారు. దీని అనంతరం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, మెగాస్టార్ చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పై వ్యంగ్యాస్త్రంగా వర్మ తీస్తున్న సినిమా' అల్లు'. అయితే ఈ సినిమా పూర్తిగా ఫిక్షనల్ కథగా సాగే సినిమాని, నేను ఈ సినిమా ద్వారా ఎవ్వరినీ టార్గెట్ చేయడం లేదంటూ, ఇటీవల వర్మ తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. 'ఈ సినిమాకి అల్లు అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే, ఇందులోని మెయిన్ క్యారెక్టర్ రకరకాల ప్లాన్స్ అల్లుతూ ఉంటాడు'. 'అలానే అందరితో తనని ఆహా అనిపించుకోవటానికి, తనకి కావాల్సిన వాళ్ళకే మంచి జరిగేలా చెప్పి ప్లాన్ ల మీద ప్లాన్ అల్లుకుపోతూ ఉండే ఒక పెద్ద అల్లికల మాస్టర్ కథే ఈ అల్లు', అంటూ వ్యంగ్యంగా మొన్న ఈ సినిమాకు సంబంధించి వర్మ ఈ ట్వీట్స్ చేసారు.
అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాలో 'అల్లుడు లెట్స్ డూ గిల్లుడు' అనే లిరిక్స్ సాగే ఒక సాంగ్ కూడా ఉండనుందట. అయితే ఈ లిరిక్స్ వింటుంటే, మనకు మెగాస్టార్ నటించిన ఖైదీ నెంబర్ 150 లోని అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ గుర్తుకు రావడం ఖాయం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా, నిజంగానే మెగాస్టార్ మూవీలోని ఈ సాంగ్ ని వర్మ తీస్తున్న అల్లు లో, లిరిక్స్ మార్చి రీమిక్స్ చేస్తున్నారా లేదా అనేది తెలియాలి అంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే .....!!