ఒక భాషలో హిట్టైన సినిమాలు మరో భాషలో రీమేక్ అవడం సర్వసాధారణం. తెలుగులో హిట్టైన ఎన్నో సినిమాలు తమిళంలో, హిందీలోకి రీమేక్ అయ్యాయి. అక్కడ సినిమాలు కూడా మన దగ్గరకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ లో హిట్టన రాక్షసన్ సినిమాను తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేశాడు బెల్లంకొండ శ్రీనివాస్. స్ట్రైట్ సినిమాలతో ఎన్ని ప్రయత్నాలు చేసినా రాని కమర్షియల్ హిట్ మనోడికి రీమేక్ ద్వారా వచ్చింది.

రమేష్ వర్మ డైరక్షన్ లో తెరకెక్కిన రాక్షసుడు సినిమాకు ఇప్పుడు సీక్వల్ ప్లానింగ్ లో ఉన్నారట చిత్రయూనిట్. ఇక్కడ విశేషం ఏంటంటే మాత్రుక సినిమా రాక్షసన్ సినిమాకు సీక్వల్ తీయలేదు. తీసే ఉద్దేశం కూడా ఉందో లేదో తెలియదు కాని తెలుగు రాక్షసుడికి మాత్రం సీక్వల్ రాబోతుంది. తెలుగులో ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఇలాంటి జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల శాతం మన దగ్గర ఎక్కువే.  

ఈ క్రమంలో రాక్షసుడు సీక్వల్ రో రావాలని ఫిక్స్ అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. సేమ్ టీం తో ఈ సీక్వల్ ఉంటుందని తెలుస్తుంది. అయితే రమేష్ వర్మ ప్రస్తుతం రవితేజతో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఆ సినిమా పూర్తయ్యాక రాక్షసుడు సీక్వల్ చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబందిచిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అంటున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బెల్లంకొండ బాబు ఇక మీదట కెరియర్ పై మరింత ఫోకస్ పెడతాడని చెప్పాడు. ఒక్క హిట్టు పడగానే కెరియర్ సెట్ చేసుకునే ఆలోచనలో పడ్డాడు బెల్లంకొండ హీరో.                                    
 

మరింత సమాచారం తెలుసుకోండి: