తెలుగులో బిగ్ బాస్ సీజ్ -4 ఈ నెలాఖరుకు మొదలు కావాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రోమో షూటింగ్ కూడా పూర్తి చేశారు నాగార్జున. అంతా బాగానే ఉంది. కంటెస్టెంట్ లను ఎంపిక చేసి వారి ఆరోగ్యంపై నిఘా పెట్టారు, పేర్లు బైటకు రానీయకుండా అంతా సీక్రెట్ గానే ఉంచారు. కానీ చివరి నిముషంలో బిగ్ బాస్ కార్యక్రమం వాయిదా పడింది. అయితే అభిమానులు మరీ అంత నిరాశపడనక్కర్లేదు. కేవలం కొన్నిరోజులు మాత్రమే ఈ కార్యక్రమం వెనక్కు వెళ్తోంది. షూటింగ్ కి సంబంధించిన కీలక సెట్టింగ్ ల నిర్మాణం ఆలస్యం కావడంతో బిగ్ బాస్ కార్యక్రమం ఆగస్ట్ లో కాకుండా సెప్టెంబర్ లో ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది.

ఆగస్ట్ నెలలో ఇప్పటికే మూడోవంతు పూర్తయింది. ఇంకా 20రోజులే మిగిలి ఉన్నాయి. బిగ్ బాస్ -4 ఇదే నెలలో మొదలయ్యేట్టుంటే ఈపాటికే ప్రోమో పడేది. కంటెస్టెంట్ ల విషయాలు బైటకొచ్చేవి. అయితే కరోనా కాలం కావడంతో పోటీదారుల విషయంపై చాలా జాగ్రత్తగా ఉన్నారు మాటీవీ నిర్వాహకులు. వారి జాగ్రత్తలు ఏ రేంజ్ లో ఉన్నాయో.. నాగార్జున ప్రోమో షూట్ రోజే తేలిపోయింది. దీనికి కొనసాగింపుగా మరికొన్నిరోజులు నాగార్జునపై ప్రోమో షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. అయితే దానితోపాటు, బిగ్ బాస్ హౌస్ కి సంబంధించి సెట్టింగులు ఆలస్యం కావడంతో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింద.
బిగ్ బాస్ కంటెస్టెంట్ లు షో మొదలు కావడానికి ముందు 14రోజులపాటు క్వారంటైన్లో ఉండాలి. ఆ టైమ్ పూర్తికాగానే కొవిడ్ టెస్ట్ లు చేసి నెగెటివ్ వచ్చినవారిని మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి అనుమతిస్తారు. అయితే వారు అక్కడ మునుపటిలాగా క్లోజ్ గా ఉండటానికి లేదు. ఎవరికి వారే సామాజిక దూరం పాటిస్తూ షోలో పార్టిసిపేట్ చేయాలి. అందుకు తగ్గట్టే వారి రూమ్ లు, ఓపెన్ ఏరియా, కిచెన్, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో లాగా స్విమ్మింగ్ పూల్ లాంటి హడావిడి ఉండదని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు కాస్త ఆలస్యం కావడంతో అనివార్యంగా బిగ్ బాస్ షో కూడా ఆలస్యమవుతోందని సమాచారం. షో ఎప్పుడు మొదలవుతుందనే విషయంపై అధికారక సమాచారం లేదు కాబట్టి, వాయిదా వేస్తున్నామనే విషయాన్ని కూడా నిర్వాహకులు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే సెప్టెంబర్ వరకు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగుతుందనమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: