టాలీవుడ్
సినిమా పరిశ్రమకు
మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ప్రవేశించిన నటుడు నాగబాబు, మొదటి నుండి ఎక్కువగా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నారు. మధ్యలో అక్కడక్కడా సినిమాల్లో హీరోగా కూడా నటించిన నాగబాబు, ఇటీవల కొన్నేళ్లుగా
ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న
జబర్దస్త్ షో ద్వారా బుల్లి తెరపై మంచి పాపులారిటీ సంపాదించారు. ఇక ఆయన నట వారసత్వంతో ఒక మనసు సినిమాతో కూతురు
నిహారిక,
ముకుంద సినిమాతో కొడుకు
వరుణ్ తేజ్ ఇటీవల
సినిమా రంగ ప్రవేశం చేసారు.
ఆ తరువాత
నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో
హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకుంది. ఇక ఆయన కుమారుడు వరుజ్ తేజ్, ఇటీవల వరుసగా విజయాలతో హీరోగా దూసుకెళ్తున్నారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే, కొన్నాళ్ల క్రితం నిహారికకు,
చైతన్య జొన్నలగడ్డతో వివాహం కుదిరిన విషయం తెలిసిందే. కాగా వారిద్దరి నిశ్చితార్ధం నిన్న పరిమిత కుటుంబ అతిథుల సమక్షంలో ఎంతో గ్రాండ్ లెవెల్లో జరిగింది.
మెగాస్టార్ చిరంజీవి,
రామ్ చరణ్,
అల్లు అర్జున్ దంపతుల రాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆ వేడుక తాలూకు ఫోటోలు నిన్నటి నుండి పలు సోషల్
మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.
అయితే అందులో ఒక ఫోటోపై పలువురు మెగాఫ్యాన్స్ సరదాగా సోషల్
మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. కాబోయే
భర్త చైతన్య కంటే
నిహారిక కొంచెం తక్కువ హైట్ ఉన్నప్పటికీ, ఆమె
అన్నయ్య వరుణ్ తేజ్ మాత్రం అతడికి సరిపోయే విధంగా మంచి హైట్ ఉండడంతో, మొత్తానికి
సరిగ్గా బావకు తగ్గ బామ్మర్ధే దొరికాడుగా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. కాగా నిహారిక, చైతన్య ల వివాహం అతి త్వరలో వైభవంగా జరుగనుంది .....!!