
ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కింగ్ కాంగ్ తో తన తదుపరి మూవీ చెయ్యబోతున్నాడు. అట్లీ తలపతి విజయ్ తో తీసిన తన రెండవ బ్లాక్ బస్టర్ సినిమా తేరి హిందీ లో కింగ్ ఖాన్ తో రీమేక్ చేయబోతున్నాడట. షారుఖ్ ఖాన్ కి కూడా ఈ మధ్య హిట్లు ఏమి లేవు. అందువల్ల అట్లీ తో మూవీ చేసి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని చూస్తున్నాడట.
షారుఖ్ ఖాన్ కి లాస్ట్ హిట్ 2012 లో వచ్చిన చెన్నై ఎక్స్ ప్రెస్ తోనే లభించింది. ఆ సినిమా ఆ సంత్సరంలో రికార్డు స్థాయిలో 424 కోట్లు వసూళ్లు సాధించి బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక ఆ చిత్రం కథ చూసుకుంటే పూర్తిగా సౌత్ ఇండియా బ్యాక్ డ్రాప్తో పూర్తిగా మన సౌత్ నేటివిటీ కి తగ్గట్టే ఉంటుంది. రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. కాని ఈ సినిమా తరువాత షారుఖ్ ఖాన్ కి వరసగా ప్లాప్ లు పడ్డాయి. ఆ ప్లాప్ లకి ఇప్పుడు దాకా బ్రేక్ లే పడలేదు. ఈ సారైనా అట్లీ తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు షారుఖ్ ఖాన్.
ఇక అట్లీ కూడా తక్కువ కాదు ఏ ఆర్ మురుగదాస్ శిష్యుడిగా ఇండస్ట్రీ కి వచ్చి ఫస్ట్ సినిమా రాజా రాణీ తో నే పెద్ద హిట్ అందుకున్నాడు. వరుస విజయాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అయిపోయాడు అట్లీ. ఇతను చేసిన అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.