దీంతో ప్రభాస్ ను ఎలాగైనా డైరెక్ట్ గా హిందీ మూవీ లో నటించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట బాలీవుడ్ ప్రముఖులు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కి చెందిన ఓమ్ రౌత్ నిర్మాణ సంస్థలో లో"ఆది పురుష్"అనే సినిమాకు సైన్ చేశారు ప్రభాస్. ఈ మూవీ రామాయణం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుంది.. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేయగా ఇది చూసిన తెలుగు ప్రేక్షకులు ఆందోళన చెందుతున్నారు. తమ ప్రియతమ హీరో ప్రభాస్ డైరెక్ట్ గా హిందీ మూవీ చేస్తే... బాలీవుడ్ లో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందేమోనని, తెలుగు సినిమాలకు ఆయన దూరం అవుతాడేమోనని బాధపడుతున్నారు.
మరికొంతమంది అభిమానులు రెబల్ స్టార్ అన్ని రంగాలలో తన సత్తా చాటు కోవడం ఆనందంగా ఉంది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.ఆది పురుష్ అనే సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మరియు తదితర విదేశీ భాషలలో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. 3డి ఫార్మాట్ లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి విజువల్ వండర్ గా రూపొందించనున్నారు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళుతుందని 2022 లో విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.