ఒక ప్రముఖ రాజకీయ వేత్త పెళ్ళికి పోర్న్ స్టార్ సన్నీ లియోన్ డాన్స్ చేస్తే తాను కోటి రూపాయలు విరాళం ఇస్తానని బహిరంగ ప్రకటన చేసిన ఒక ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి మాటలు ఇప్పుడు బాలీవుడ్ లో సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తాను టీవీ యాంకర్ అమృతా రాయ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పటి నుంచి ఈవిషయంలో రోజుకొక కామెంట్స్, సెటైర్స్ వినబడుతున్నాయి.
తాజాగా దిగ్విజయ్ పెళ్లి అమృతా రాయ్‌తో జరిగి నప్పుడు ఆ ఫంక్షన్‌లో శృంగార తార సన్నీలియోన్ నగ్న ప్రదర్శన ఏర్పాటు చేయాలని బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్, యాక్టర్, డైరెక్టర్ కమాల్ రషీద్ ఖాన్ దిగ్విజయ్ కు సూచించాడు. అందుకు తాను కోటి రూపాయలు విరాళంగా ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు.
ఈమేరకు కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్లో ఓ ట్వీట్ చేశాడు. ‘ఆయన తన పెళ్లిలో సన్నీలియోన్‌తో అర్ధ నగ్న ప్రదర్శన చేయిస్తే నేను కాంగ్రెస్ పార్టీకి కోటి రూపాయల ఫండ్ ఇస్తాను’ అంటూ పేర్కొన్నాడు. దీనిపై డిగ్గీరాజా స్పందించకపోయినప్పటికీ సన్నీలియోన్ మాత్రం ఘాటుగా స్పందించింది.
ముసలాయన రెండో పెళ్లికి తాను డ్యాన్స్ చేయడమేంటని భావించదమే కాకుండా ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు కుడా చేసిందట సన్నీ. ఇక రానున్న కాలం లో దిగ్విజయ్ సింగ్ రెండో పెళ్లి వ్యవహారం పై ఇంకా ఎన్ని సెటైర్లు పడతాయో అంటూ మీడియా తెగ రాతలు రాస్తోంది .
మరింత సమాచారం తెలుసుకోండి: