తెరపై తమ నటనతో, మాటలతో, డాన్సులతో మెప్పించే నటులన్నా, వారికి సంబంధిచిన విషయాలన్నా అభిమానులలో అమితాసక్తి నెలకొని ఉంటుంది. వారి ఫుడ్ హాబిట్స్, నచ్చిన కలర్, చదివే పుస్తకం, రోల్ మోడల్ ఇలా ప్రతి విషయం తెలుకోవాలని ఉంటుంది. అంతకు మించి వారి బంధాలు బంధుత్వాలపై కూడా కురియాసిటీ ఉంటుంది. మరి అలాంటి కొన్ని తారలబంధుత్వాల గురించి ఇక్కడ చెప్పడం జరిగింది.. మరి ఓ లుక్కేయండి.


 
కమల్ హాసన్-సుహాసిని
 
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాసినికి లోకనాయకుడు కమలహాసన్ బాబాయ్ అవుతారు. కమల్ హాసన్ మరియు చారు హాసన్ అన్నదమ్ములు కాగా సుహాసిని చారుహాసన్ కూతురు. చారుహాసన్ కూడా అనేక తెలుగు మరియు తమిళ చిత్రాలలో నటించారు. ఇక సుహాసిని లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంగారిని 1988 లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కమల్ కి కూతురు వరసయ్యే సుహాసిని ఆయన సినిమాలలో నటించినా.. హీరోయిన్ గా మాత్రం చేయలేదు.


సావిత్రి-రేఖ

సౌత్ నుండి వెళ్లి బాలీవుడ్ లో చక్రం తిప్పిన హీరోయిన్స్ లో రేఖ ఒకరు. నటుడు జెమిని గణేశన్, పుష్పవల్లి అనే మరోనటితో ఆయన కొన్నాళ్ళు బంధం కొనసాగించారు.వారి సంతానమే ఈ హీరోయిన్ రేఖ. ఇక జెమినీ గణేష్ సావిత్రిని కూడా రహస్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా సావిత్రి రేఖకు సవతి తల్లి అవుతుంది.



ఏ ఆర్ రెహమాన్-జి వి ప్రకాష్

సంగీత దర్శకుడిగా పరిచయమై హీరోగా మారాడు జివి ప్రకాశ్. ఈ టాలెంటెడ్ ఆర్టిస్ట్ కమ్ మ్యుజీషియన్ ఎవరో కాదు. లెజెండరీ సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ కి స్వయానా మేనల్లుడు. ఎఆర్ రెహమాన్ పెద్దక్క ఎఆర్ రెయ్హానా కొడుకే జివిప్రకాశ్. హిందువు అయిన దిలీప్ కుమార్ మతం మార్చుకొని ఆర్ రెహమాన్ అయ్యారు. అందుకే వెరి పేర్లు భిన్నంగా ఉన్నాయి.



విజయ్ కుమార్-అరుణ్ విజయ్

తెలుగులో శ్రీను వైట్ల డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా నటించిన "బ్రూస్ లీ" సినిమాలో విలన్ గా నటించి తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు అరుణ్ విజయ్. అరుణ్ విజయ్ ఎవరో కాదు,  సీనియర్ నటుడు విజయ్ కుమార్ సొంత కొడుకు. ఆయన మొదటి భార్య ముత్తుకున్ను సంతానమే అరుణ్ విజయ్. మొదటి భార్య ముత్తుకున్ను చనిపోయాక నటి మంజులను వివాహం చేసుకున్నారు విజయ్ కుమార్. మంజులా- విజయ్ కుమార్ లకు పుట్టిన పిల్లలే ప్రీతి, శ్రీదేవిలు. తెలుగులో అనేక సినిమాలలో హీరోయిన్స్ గా నటించారు.



జయసుధ- విజయ నిర్మల

సహజనటి జయసుధకి కృష్ణ భార్య అయిన విజయనిర్మల వరుసకు అత్త అవుతారు. క్రిష్ణ, విజయ నిర్మల కలిసి నటించిన పండంటి కాపురం మూవీ భారీ విజయం అందుకుంది ఆ సినిమా ద్వారానే జయసుధని చైల్డ్ ఆర్టిస్ట్ వెండి తెరకు పరిచయం. తన స్వశక్తితో సినిమాలలో ఎదిగిన జయసుధ స్టార్ హీరోయిన్ గా అనేక సినిమాలలో నటించారు.



చంద్రమోహన్ – కె. విశ్వనాధ్

కళాతపస్వి కె విశ్వనాధ్ మరియు నటుడు చంద్ర మోహన్ కజిన్ బ్రదర్స్ అవుతారు. ఆ రిలేషన్ తోనే విశ్వనాధ్ ఆయన దర్శకుడిగా చేసిన అనేక చిత్రాలలో చంద్ర మోహన్ కి కీలక రోల్స్ ఇవ్వడం జరిగింది.



ప్రియమణి – విద్యాబాలన్

బాలీవుడ్ లో సత్తాచాటిన సౌత్ హీరోయిన్స్ లో విద్యాబాలన్ ఒకరు. నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ ప్రియమణి ఈమెకు కజిన్ సిస్టర్ అవుతారు. అంతేకాదు ప్రముఖ ప్లేబాక్ సింగర్ మాల్గుఢి శుభకి ప్రియమణి మేనకోడలు అవుతుంది.



ఆర్ బి చౌదరి-జీవా

సుస్వాగతం, రాజా, సూర్యవంశం మరియు నువ్వు వస్తావని వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన నిర్మాత సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరీ కొడుకు కూడా హీరోనే. నటుడు జీవా ఆయన కుమారులలో ఒకరు. జీవా హీరోగా వచ్చిన రంగం మూవీ తెలుగులో కూడా సూపర్ హిట్ కొట్టింది. మరో కుమారుడు జిషన్ కూడా హీరోగా అనేక సినిమాలలో నటించారు.



నగ్మా-జ్యోతిక-రోహిణి

1990లలో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన నగ్మాకు హీరోయిన్ జ్యోతిక ,రోషిణి సొంత చెల్లెళ్లు అవుతారు. షమా ఖాజి , మొరార్జి ల కూతురు నగ్మ. మొరార్జి తో విడాకుల తర్వాత నిర్మాత చందర్ సదానా ని వివాహం చేసుకున్నారు షామా ఖాజీ. వారి పిల్లలే జ్యోతిక , రోషిణి. జ్యోతిక హీరోయిన్ గా అందరికి పరిచయమే, ఈమె నటుడు సూర్యను పెళ్లి చేసుకున్నారు. ఇక రోషిణి చిరంజీవి నటించిన మాస్టర్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసింది.



సెల్వ రాఘవన్-విద్యుల్లేఖ

దర్శకుడు సెల్వరాఘవన్ హాస్యనటి విద్యుల్లేఖ రామన్ కి బావ అవుతారు. 7జి బృందావన్ కాలని హీరోయిన్ సోనియా అగర్వాల్ తో విడాకుల తర్వాత గీతా రామన్ ని వివాహం చేసుకున్నారు సెల్వ రాఘవన్. గీతా రామన్, విద్యుల్లేక రామన్ అక్కాచెల్లెల్లు. విద్యుల్లేక రామన్ తండ్రి మోహన్ రామన్ కూడా ప్రముఖ నటుడే.



టబు-షబానా అజ్మీ

బాలీవుడ్ హీరోయిన్ అయినా కూడా నిన్నే పెళ్లాడతా, కూలీ నంబర్ వన్, ఆవిడా మా ఆవిడే వంటి చిత్రాలతో తెలుగు వారికీ బాగా పరిచమైన హీరోయిన్ టబు. ఇటీవల అల వైకుంఠపురంలో నటించిన ఈమె ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ షబానా అజ్మికి మేనకోడలు. టబు తండ్రి జమాల్ హష్మి షబానా కి సొంత అన్నయ్య అవుతారు.




రజిని కాంత్- అనిరుధ్

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ కి సూపర్ స్టార్ రజిని కాంత్ మామ వరుస అవుతారు. రజిని భార్య లత, అనిరుద్ తండ్రి రవి రాఘవేంద్ర ఇద్దరూ అన్నాచెల్లెల్లు. ఆ విధంగా వీరిద్దరి మధ్య బంధుత్వం ఉంది.



ఐశ్వర్య రాజేష్ – శ్రీలక్ష్మి

ఇటీవల కౌసల్యా క్రిష్ణమూర్తి, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఐశ్వర్య అలనాటి నటుడు రాజేశ్ కూతురు.. ఇంతకీ ఈ రాజేశ్ ఎవరో తెలుసా హాస్యనటి శ్రీలక్ష్మికి స్వయంగా తమ్ముడు.. అంటే శ్రీలక్ష్మికి ఐశ్వర్య మేనకోడలు..

మరింత సమాచారం తెలుసుకోండి: