ప్రముఖ ఎంటర్టైన్మెంట్స్ ఛానెల్ ఈటివి సక్సెస్ ఫుల్ గా 25 ఇయర్స్ పూర్తి చేసుకుంది. ఈటివి ఇది మన టివి అనిపించేలా పాతికేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. సినిమాలు, సీరియల్స్, కామెడీ షోస్ ఒక్కటేంటి ప్రేక్షకులకు ఏది కావాలో అది అందిస్తూ పాతికేళ్ళ ఈ ప్రస్థానంలో ఎప్పుడు మొదటి రెండు స్థానాల్లోనే కొనసాగుతూ వచ్చింది ఈటివి. ఈటివి పాతికేళ్ల వార్షికోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీస్ కామెంట్స్ చేశారు. అందులో సూపర్ స్టార్ మహేష్ ఈటివి 25 ఇయర్స్ వార్షికోత్సవం సదర్భంగా చేసిన ట్వీట్ ఇంట్రెస్టింగ్ మారింది.  

ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న మహేష్ ప్రతి చిన్న విషయం గురించి ట్వీట్స్ వేస్తూ తన అభిప్రాయాని తెలుపుతున్నాడు. లేటెస్ట్ గా ఈటివి పాతిక సంబత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ ఈటివి సంస్థల అధినేత రామోజి రావుకి కంగ్రాట్స్ చెప్పారు. రెండు దశాబ్ధాల ప్రయాణం.. ఈనాటు నెట్ వర్క్ ఎదిగిన విధానం సంతోషకరం. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు రామోజి రావు గారికి, ఈటివి టీం, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు మహేష్.  

కొన్నాళ్ళు పోటీలో వెనకపడ్డ ఈటివి జబర్దస్థ్, పటాస్, ఢీ షోలు మళ్ళీ ఈటివిని మంచి స్థాయిలో నిలబడేలా చేశాయి. ఈటివిలో వచ్చే జబర్దస్త్, ఢీ షోకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు. 11 సీజన్లుగా ఢీ, ఆరేడేళ్ళుగా జబర్దస్త్ ఇప్పటికి మంచి ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోలుగా రన్ అవుతున్నాయి.                                                   





మరింత సమాచారం తెలుసుకోండి: