సూర్య సినిమా ఓటిటి రిలీజ్ పై తమిళనాడు థియేటర్ యాజమాన్యాలు మండిపడుతున్నాయి. ఇదివరకే సూర్య నిర్మాతగా జ్యోతిక సినిమా ఓటిటి రిలీజ్ చేస్తున్న టైం లోనే సూర్య సినిమాలు థియేటర్ లలో ఆడనివ్వమని చెప్పిన థియేటర్ యాజమాన్య సంస్థలు ఇప్పుడు డైరెక్ట్ గా సూర్య సినిమా డిజిటల్ రిలీజ్ చేస్తుండటంతో వ్యవహారం మరింత సీరియస్ గా మారింది. అయితే స్టార్ డైరక్టర్ హరి సూర్య సినిమా ఓటిటి రిలీజ్ చేయడంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేయగా మరో సీనియర్ స్టార్ డైరక్టర్ భారతీరాజా మాత్రం సూర్య నిర్ణయాన్ని స్వాగతించారు.
తక్కువ బడ్జెట్ సినిమాలకు థియేటర్లు ఇవ్వనప్పుడు.. థియేటర్ లలో సినిమాలు ఆడేప్పుడు పాప్ కార్న్ నుండి పార్కింగ్ వరకు పెద్ద దోపిడీ జరిగింది.. అప్పుడు ఎవరు ఎదురు ప్రశ్నలు అడలేదని.. సూర్య సినిమాలు ఓటిటి అనగానే థియేటర్ లు నష్టపోతాయని మాట్లాడుతున్నారని అన్నారు భారతీరాజా. సూర్య విషయంలో కొందరు కావాలని గొడవ చేస్తున్నారని. దీని వెనుక రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉందని భారతీరాజా సంచలన కామెంట్స్ చేశారు. రీల్ హీరోగానే కాదు అవకాశం దొరికినప్పుడల్లా రియల్ హీరోగా ఆపద సమయంలో తన వంతు సాయాన్ని చేస్తున్న సూర్య సినిమాకు ఇలాంటి అడ్డంకులు ఏర్పడటం ఎవరు ఊహించలేదు. ఆకాశం నీ హద్దురా సినిమా అమేజాన్ ప్రైమ్ కు అమ్మేసి ఆ వచ్చిన మొత్తం లో 5 కోట్లను సినీ కార్మికుల సహాయార్ధంగా ఉపయోగిస్తున్నట్టు ప్రకటించారు సూర్య. మరి ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యాలు ఎక్కడివరకు తీసుకెళ్తారో చూడాలి.