
ఇలాంటి పరిస్థితులలో ఆమె లేటెస్ట్ గా నటిస్తున్న మూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్ కు విపరీతమైన డిజ్ లైక్స్ రావడంతో ఆమెను ‘ఆర్ ఆర్ ఆర్’ లో హీరోయిన్ గా కొనసాగించాల లేదా అన్న విషయమై రాజమౌళి అంతర్మధనంలో ఉన్నట్లు వార్తలు కూడ వినిపించాయి. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణం ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియక ఈ మూవీకి బిజినెస్ ఏ స్థాయిలో అవుతుందో తెలియక తికమకపడుతున్న రాజమౌళికి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో అలియా భట్ పాత్రను ప్రియాంకా చోప్రాతో చేయిస్తే ఎలా ఉంటుంది అన్న సూచనను కొందరు రాజమౌళి సన్నిహితులు ఇస్తున్నట్లు టాక్.
అయితే ఈ సూచన కొంతవరకు రాజమౌళిని ఆలోచింప చేస్తున్నా ప్రస్తుతం ఈ మూవీకి ఎదురౌతున్న సమస్యలకు తోడుగా హీరోయిన్ మార్పు విషయం ఆలోచించే సాహసం రాజమౌళి చేయలేకపోతున్నాడు అని టాక్. వాస్తవానికి ప్రస్తుతతరం యూత్ లో ప్రియాంకా చోప్రా క్రేజ్ బాగా తగ్గిపాయింది. దీనికితోడు చరణ్ ప్రియాంక చోప్రాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జంజీర్’ మూవీ భయకరమైన ఫ్లాప్.
ఈ కారణాలతో మళ్ళీ ఫెయిల్యూర్ కాంబినేషన్ ను ‘ఆర్ ఆర్ ఆర్’ లో రిపీట్ చేయడం మంచిది కాదని రాజమౌళి ఆలోచన అని అంటున్నారు. అయితే రోజురోజుకు అలియా భట్ ను ద్వేషించేవారి సంఖ్య దేశంలో పెరుగుతున్నప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల కావడానికి మరొక సంవత్సర సమయం పడుతుంది కాబట్టి అప్పటికి అలియా భట్ పై పెరుగుతున్న ఈ ద్వేష వాతావరణం చల్లరిపోతుందని రాజమౌళి భరోసా అని అంటున్నారు..