థియేటర్ల వ్యవస్థకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. సెప్టెంబర్ నెలలో థియేటర్ల ఓపెనింగ్ కు అనుకూలంగా వస్తాయనుకున్న అనుమతులు కాస్త కొత్త మార్గదర్శకాలతో ఇక ఇప్పట్లో రావని తెలిసిపోయింది. దీంతో ఇంతకాలం ఓటీటీలకు  వెల్లకుండా భీష్మించుకు కూర్చున్న చిత్రాలకు ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవ్వనున్నాయి.

కరోనా ఎఫెక్ట్ తో లాక్ డౌన్ లో సినిమా హాళ్లు మూతపడ్డాయి.ఈ సమయంలో సినిమాలను చూడాలనుకున్నవారంతా ఇంట్లో కూర్చుని ఓటీటీలో వచ్చే సినిమాలను హ్యాపీగా చూస్తూ కూర్చున్నారు. కానీ థియేటర్లో కూర్చుని చూస్తే వచ్చే ఆ మజాను మాత్రం మిస్ అయిపోతున్నారు. ఆ కేకలు, ఈలలు లేని మూవీ వాచింగ్ ను సినీ ప్రియులను రిసీవ్ చేసుకోలేకపోతున్నారు.

తాజాగా వచ్చిన అన్ లాక్ 4.0 మార్గదర్శకాలలో మళ్లీ థియేటర్లు ఓపెన్ అవ్వడానికి వీల్లేదు అని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో మరోసారి థియేటర్ల వ్యవస్థ ప్రశ్నార్ధకమైంది. ఇప్పటికే ఉపాదిలేక ఇబ్బందిపడుతోన్ప థియేటర్ సిబ్బందికి ఇది పెద్ద షాక్. అయితే ఈ తాజా నిర్ణయంతో ఓటీటీలకు మరింత బెనిఫిట్ కలగనుంది. నిన్నటివరకు తమ సినిమాలను ఎలాగైనా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చూసిన వాళ్లంతా ఇప్పుడు ఓటీటీలవైపు దీనంగా చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. 30రోజులలో ప్రేమించడం ఎలా.. ఉప్పెన లాంటి సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి.

నిన్నటి వరకు రేట్ల విషయంలో కొండదిగి రాని ఈ చిత్రాల నిర్మాతలు... ఇప్పుడు తమ సినిమాలు  రిలీజ్ చేయడానికి ఇంకా లేట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదనే బావనలో ఉన్నారు. దానిలో భాగంగా ఇంతకుముందు వచ్చిన ఆఫర్ కే ఓటీటీలకు తమ సినిమాలను అమ్మినా అమ్మేయెచ్చు. ఇది ఒక రకంగా థియేటర్ల వ్యవస్థను పుంజుకోకుండా చేయడం లాంటిదే. మొత్తానికి సినీ ప్రేమికులు థియేటర్లలో ఉండే మజాను కోల్పోతున్నారు. ఏది ఏమైనా థియేటర్ లో సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా.. అనేలా కరోనా రాకముందు ఉండే రోజులను గుర్తు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: