బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు కూడా తమ సినిమాలను ఓటీటీ లలో విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపుతున్నారు. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, అజయ్ దేవగన్ తదితరులు నిర్మాతలపై అప్పుల భారం పెరిగి పోకూడదని తమ సినిమాల యొక్క డిజిటల్ రిలీజ్ లకు ఓకే చెప్పేశారు. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకొని నిర్మాతలను ఓటీటీ లో సినిమాలను విడుదల చేసేందుకు అంగీకరిస్తున్నారు.
భారత దేశ వ్యాప్తంగా అందరూ కూడా నిర్మాతలపై భారం తగ్గిస్తున్న నేపథ్యం లో తెలుగు హీరోలు కూడా అందరితో పాటే తాము అన్నట్టు నిర్మాతల నిర్ణయాలకు సానుకూలంగా స్పందించాల్సిన పరిస్థితి వస్తోంది. సినిమా థియేటర్లు తెరిచే లోపు కనీసం అయిదు, ఆరు నెలల సమయం పట్టొచ్చు. అంతలోపు ఎంతమంది తెలుగు హీరోలు నిర్మాతల మాటలను విని వారి పరిస్థితిని అర్థం చేసుకుని తాము నటించిన సినిమాలను డిజిటల్ తెరపై విడుదల చేసేందుకు అంగీకరిస్తారో చూడాలిక.