ఇక ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత, అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన అలవైకుంఠపురములో సినిమాలతో మరొక రెండు భారీ సక్సెస్ లు అందుకున్న త్రివిక్రమ్, అతి త్వరలో ఎన్టీఆర్ తో మరొక సినిమా చేయనున్నారు. కాగా దీని అనంతరం త్రివిక్రమ్ చేయబోయే సినిమాల విషయమై కొద్దిరోజులుగా పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. టాలీవుడ్ బడా స్టార్స్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో త్రివిక్రమ్ ఒక సినిమా చేయనున్నారు అనే వార్త కొన్నేళ్లుగా ప్రచారం అవుతున్నప్పటికీ దాని పై ఇప్పటివరకు ఎక్కడా కూడా అధికారిక సమాచారం లేదు. అయితే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇద్దరు బడా స్టార్స్ తో ఒక భారీ పవర్ఫుల్ సినిమాని చేసేందుకు త్రివిక్రమ్ తన టీమ్ తో కలిసి కొన్నాళ్ల నుండి ఒక స్టోరీ ని రెడి చేస్తున్నారని అంటున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు కమర్షియల్ హంగులు కలగలిపి, ఆయా హీరోల అభిమానుల ఆశలు, అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా త్రివిక్రమ్ ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ విధంగా మహేష్, పవన్ లతో కలిసి చేయబోయే సినిమా కోసం త్రివిక్రమ్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ లో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు గాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం ఇది కేవలం మహేష్, పవన్ ల అభిమానులకు మాత్రమే కాదు, యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులకు అతి పెద్ద పండుగ వార్త అనే చెప్పాలి ...... !!!