టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అంతకముందు కొన్నాళ్లపాటు ప్రముఖ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యుడిగా పలు సినిమాలకు పని చేసిన పూరి, తొలి సినిమా బద్రితో పెద్ద సక్సెస్ ని అందుకున్నారు. ఆ తరువాత ఫ్యామిలీ హీరో జగపతి బాబుతో ఆయన తీసిన బాచి సినిమా మాత్రం ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక మాస్ మహారాజ రవితేజ కు కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు అందించింది మాత్రం పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. అప్పట్లో మొదటగా రవితేజ, పూరి ల కాంబోలో వచ్చిన సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మంచి విజయాన్ని అందుకోగా, దాని తరువాత వచ్చిన ఇడియట్, అమ్మ నాన్నతమిళ అమ్మాయి సినిమాలు రెండూ మరింత పెద్ద సక్సెస్ లు అందుకుని అటు రవితేజ తో పాటు ఇటు పూరి కి కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి.


ఇక వాటి అనంతరం నాగార్జున తో శివమణి, సూపర్ సినిమాలు తీశారు పూరి. అయితే వాటిలో శివమణి సక్సెస్ అవ్వగా, సూపర్ మాత్రం అంత సక్సెస్ కాలేదు. ఇక వాటి అనంతరం సూపర్ స్టార్ మహేష్ తో పూరి తీసిన పోకిరి సినిమా అప్పట్లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి మహేష్ తో పాటు పూరి కి కూడా ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత మరింతగా అవకాశాలు దూసుకెళ్లిన పూరి, మధ్యలో కొన్ని పెద్ద సక్సెస్ లతో పాటు  మరికొన్ని ఫ్లాప్స్ కూడా అందుకున్నారు. ఇక  ఇటీవ ల ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న పూరి, గత ఏడాది రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తో మళ్ళి ఫామ్ లోకి వచ్చారు. అయితే తన కెరీర్ ఎంతో ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మహేష్ సహా కొంతమంది హీరోలు తన నుండి కథలు వినడానికి ఇష్టపడలేదని కొన్నాళ్ల క్రితం పూరి సంచలన కామెంట్స్ చేసారు. ఇక అసలు మ్యాటర్  ఏంటంటే, పూరి ఆ కామెంట్స్ చేసిన తరువాత మొన్న ఆగష్టు 9న సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే నాడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయనే లేదు.


మరోవైపు చిన్న ఆర్టిస్ట్ నుండి దాదాపుగా సినిమా పరిశ్రమకు చెందిన అనేకమంది మహేష్ కు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విషెస్ చెప్తే ఒక్క పూరి మాత్రమే చెప్పకపోవడం లో ఏదో ఆంతర్యం ఉందని, ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే పూరి కావాలనే మహేష్ మీద కోపంతోనే విష్ చేయలేదని పలువురు మహేష్ ఫ్యాన్స్ ఇటీవల కామెంట్స్ చేసారు. ఇక మూడు రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కూడా పూరి విష్ చేయకపోవడంతో పలువురు పవన్ ఫ్యాన్స్ కూడా పూరి ని ఈ విషయమై సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరి ఈ ఇద్దరు బడా స్టార్స్ కు మిగతా అందరూ విష్ చెప్పినప్పటికి కేవలం పూరి మాత్రమే విష్ చేయకపోవడంతో వారిద్దరినీ ఆయన పట్టించుకోలేదా లేక మర్చిపోయారా అంటూ పలువురు టాలీవుడ్ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు ..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: