
తాజాగా ఇక్కడ ఓ సెలబ్రిటీ కి ఇలాంటి ఘటన ఎదురైంది. ఇటీవలే ఓ పెళ్లయిన సెలబ్రిటీ అభిమానుల తో ముచ్చటించింది ఈ క్రమంలోనే ఓ నెటిజన్... పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రపోజల్ పెట్టాడు.. ఈ ప్రపోజల్ కి షాకింగ్ సమాధానం ఇచ్చింది ఆ సెలబ్రిటీ. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు... కోలీవుడ్ లో వీడియో జాకీగా ఎంతగానో పాపులర్ అయ్యి ... ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న దియా మీనన్ . ఈమెకి ఎప్పుడో పెళ్లి అయిపోయింది. ఈ విషయం కొంత మంది నెటిజన్లకు మాత్రం తెలియదు.
అయితే దియా మీనన్ ఇటీవలే సోషల్ మీడియా వేదిక గా అభిమానుల తో ముచ్చటించారు. ఈ క్రమం లోనే ఓ నెటిజన్ ఏకంగా దియా మీనన్ కు ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పేసాడు. ఐ లవ్ యు.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.. నేను వర్జిన్ ... కావాలంటే టెస్ట్ కూడా చేయించుకోండి అంటూ మెసేజ్ పంపాడు. ముందుగా నెటిజన్ తీరు తో షాక్ అయిన దియా కాసేపటికి షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. నిజంగానా అయితే నా భర్తను అడిగి చెబుతాను అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.