మెగా ఇంటి ఆడపడుచు నిహారిక .....తెలుగులో "ఢీ" వంటి పలు టీవీ షోస్ లో యాంకరింగ్ చేయడంతో పాటు ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం లాంటి సినిమాలు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.... సక్సెస్ పరంగా ఈ సినిమాలు ఆశించిన ఫలితం రాబట్టలేకపోయినా నటనతో ప్రేక్షకులను మెప్పించకలిగింది నిహారిక. ఏదేమైనా టాలీవుడ్ లో అనుకున్న స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో  కోలీవుడ్ పై మనసు పడింది ఈ మెగా ప్రిన్సెస్.



కోలివుడ్ తెరపై అయినా సక్సెస్ హీరోయిన్ గా ఎదగాలనే ఆశతో తమిళంలో స్వాతిని దర్శకత్వంలో అశోక్ సెల్వన్ హీరోగా రూపొందనున్న ఓ రొమాంటిక్ లవ్  సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.... గతంతో పోలిస్తే ఈ సినిమాలో మరింత కాస్త గ్లామర్ తో పాటు రొమాంటిక్ గా కనిపించబోతుంది నిహారిక అనే వార్తలు వచ్చాయి.. అంతేకాదు  ఈ సినిమా కోసం పలుసార్లు చెన్నై కూడా వెళ్లి వచ్చింది. అంతా కుదిరిన తర్వాత కరోనా కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది... ఇక ఇప్పుడేమో మొత్తానికే పుల్ స్టాప్ పెడుతూ సినిమా నుండి ఎగ్జిట్ అయ్యారు నిహారిక.. అనూహ్యంగా ఈ ప్రాజెక్టు నుంచి నిహారిక లెఫ్ట్ అయినట్లు చిత్ర యూనిట్ చేసిన ప్రకటనతో అంతా ఆశ్చర్యపోయారు.



ఇప్పుడా హీరోయిన్ పాత్ర కాస్త  మేఘా ఆకాష్‌ చేతికి అందించినట్లు, డైరెక్టర్ స్వాతిని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేశారు. దీంతో మెగా డాటర్ తప్పుకోవడం వెనుక పలు కారణాలు విశ్లేషిస్తూ చర్చలు స్టార్ట్ అయ్యాయి. త్వరలో పెళ్ళి పీటలు ఎక్కనున్న నిహారిక... అత్తారింటి వారు పెట్టిన కండీషన్స్ మూలంగానే ఈ నిర్ణయం తీసుకుందని, అందుకే చేతికందిన మంచి అవకాశాన్ని సైతం వదులుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.... ఇదిలా ఉంచితే అసలు ఆమె ఇక కెమెరా ముందుకు రావడమే జరగదని.... ఆమె తీసుకున్న ఈ డెసిషన్ తో కన్ఫర్మ్  అయిందని గుసగుసలు  తో వినిపిస్తున్నాయి.. కానీ ఈ విషయంపై నిహారిక నుంచి కానీ ఆమె కుటుంబ సభ్యుల నుండి గాని ఎటువంటి ప్రకటన బయటికి రాలేదు...


మరింత సమాచారం తెలుసుకోండి: